Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

ఇంటి వైద్యంతో జలుబుకి స్వస్తి

ph2

పిల్లల ముక్కు బ్లాక్ అయినపుడు వారు పడే ఇబ్బంది మనం చూడలేం. ఇంట్లో ఉండే ఔషధాల ద్వారా జలుబు తగ్గించుకోవచ్చు. పిల్లలలో కలిగే జలుబును ఇంట్లోనే ఉండే వస్తువులతో ఎలా తగ్గించుకోవచ్చునో చూద్దాం…
జలుబు, పిల్లలను ఆడుకోనివ్వకుండా, అలసిపోయేలా చేసి అనేక ఇబ్బందులను కలిగిస్తుంది. పిల్లలకు చిన్న వయస్సులో మాత్రలు, మందులు వాడే సమయం కూడా కాదు. ఇలాంటి సమయంలో సహజ పద్ధతులను అనుసరించటం ద్వారా పిల్లలలో జలుబు తగ్గించవచ్చు. మీ పిల్లలూ జలుబు లేదా దగ్గు వంటి సమస్యలతో బాధపడితే ఇక్కడ తెలిపిన ఔషధాలను వాడి, జలుబు సమస్య నుండి ఉపశమనం అందించండి.
* ఎక్కువ సమయం విశ్రాంతి : ఎక్కువ సమయం తీసుకునే విశ్రాంతి ద్వారా అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. జలుబు పిల్లలను అలసిపోయేలా, చికాకులకు గురి చేస్తుంది. కానీ పిల్లలు నిశ్శబ్దంగా ఉన్నపుడు లేదా పడుకున్నపుడు జలుబు నయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ పిల్లలు ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకునేలా చూడండి. సరైన సమయంతోపాటూ విశ్రాంతి జలుబును తగ్గిస్తుంది.
* వేడి ఆవిరులు : వెచ్చని తేమతో కూడిన గాలిని పీల్చటం వల్ల జలుబు నుండి పిల్లలు ఉపశమనం పొందుతారు. మీ పిల్లల గదిలో తేమభరిత వాతావరణం అధికంగా ఉండేలా చూడండి. అంతేకాకుండా, ఇతర ఆరోగ్య లాభాల కోసం గానూ, వేడి నీటితో స్నానం చేపించటం మంచిది.
* జలుబును తగ్గించే స్లైన్ డ్రాప్స్ : పిల్లల వయసు ఎక్కువగా ఉంటే స్లైన్ డ్రాప్స్ ద్వారా ముక్కును శుభ్రపరచవచ్చు. పిల్లలలో ముక్కులో ఉన్న వాటిని శుభ్రపరచటానికి సిరంజ్ లేదా పాలు పట్టే డబ్బా కూడా సహాయపడుతుంది. సిరంజ్ ద్వారా పిల్లల ముక్కులో ఉన్న అన్ని రకాల వాటిని శుభ్రపరచటం ద్వారా జలుబు లక్షణాలను తగ్గించవచ్చు.

* జలుబు తగ్గించే అదనపు ద్రవాలు : మీ బాబు లేదా పాప 6 నెలల లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే, అధిక ద్రావణాలను తాగించటం ద్వారా శరీరం డీ హైడ్రేషన్‌కు సుముఖంగా ఉంటుంది, ముక్కు నుండి కారే ద్రవాలు బయటకు పోతాయి. ఫ్రూట్ స్మూతీస్, ఆరోగ్యకర ద్రావణాలు పిల్లలు ఆస్వాదించటమే కాదు,వారి జలుబు కూడా తగ్గిపోతుంది.

Comments

comments