Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

గంభీరావుపేటలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

clctr

గంభీరావుపేట: గంభీరావుపేట మండలంలో బుధవారం జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆకస్మిక పర్యటన చేశారు. ఉదయం మండల కేంద్రానికి రావడంతోపలుశాఖలఅధికారులు హైరానా పడ్డారు. ఏ కార్యాలయానికి మొదలు వస్తాడో.. ఎవరిపై ఏఏ చర్యలు ఉంటాయో అంటూ అ ధికారులు అయోమయానికిలోనయ్యారు.మొదట కలెక్టర్ ముస్తాఫానగర్ లో హరితహారంలో భాగంగా గౌడ సంఘం స్థలంలో పెంచిన ఈతమొక్కలను ఆయన పరిశీలించారు. మొ క్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సం బంధితాధికారులను ఆదేశించారు.
అనంతరం వ్యవసాయ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ భూసార పరీక్షలు నిర్వహిస్తున్న విధానాన్ని అడిగితెలుసుకున్నారు.ఏమైనా సమస్యలున్నాయా అ ంటూ సిబ్బందిని ప్రశ్నించారు.దీనికి తమకు ప్రస్తు తం మండల పరిషత్ కార్యాలయంలో కేటాయించిన ఆఫీసు ఇరుకుగా ఉందని పేర్కొన గా అందుకు పాత తహసీల్‌కార్యాలయాన్ని వినియోగించుకోవాలని సూ చించారు.కలెక్టర్ వెంట వ్యవసాయ శాఖ జిల్లా అధికారి అనిల్‌కుమార్, ఎంపిడిఒ సురేందర్‌రెడ్డి, ము స్తాఫానగర్ సర్పంచ్ ఉసుక దేవలక్ష్మి,ఎసిఎం రాజయ్య, ఎఇఒ నవీద్, మౌనిక, విఆర్‌ఒ బాలకిషన్, ఎంపిటిసి కమలాకర్‌రెడ్డి, నాయకులు బండ రమేశ్, తదితరులు ఉన్నారు.
ఎస్‌సి హాస్టల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్
విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన వాచ్‌మెన్,
కుక్‌లను విధుల నుంచి తొలగింపు
గంభీరావుపేట మండల కేంద్రంలోని ఎస్‌సి హాస్టల్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ క్రృష్ణభాస్కర్ ఆకస్మిక తనిఖీ చేశారు.ఉదయమేహాస్టల్‌కు వెళ్లిన కలెక్టర్‌కు ఓ గదిలో విద్యార్థులు చదువుకుంటూ కనిపించారు. దీంతో తా నూ విద్యార్థుల వద్దకు వెళ్లి కింద కూర్చొని విద్యార్థులను వారి చదువుకు సంబంధించిన ప్రశ్నలు వేశారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ పిల్లలను ప్ర శ్నించారు.దీంతో చలి బాగా ఉన్నందున ర గ్గులు సరిపోవడం లేదని,బాత్‌రూంలో నల్లాలు రా వడం లేదని పిల్లలు కలెక్టర్ దృష్టికి తీసుకపోయారు. అంతే కాకుం డా కలెక్టర్ మరింత దగ్గరై పిల్లలతో ఇంకా ఏమైనా స మస్యలున్నాయా అని అడుగగా అందుకు సంపంగి రాజు అనే విద్యార్థి తనను మంగళవారం రోజున వా చ్‌మెన్ రహీం చెప్పుతో కొట్టాడు సార్ అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు.దీంతో విద్యార్థులపై దాడికి దిగడమా అంటూ ఆశ్చర్యానికి గురైన కలెక్టర్ వాచ్‌మెన్‌ను పిలిచి ప్రశ్నించారు. అంతే కాకుండా వంటమనిషి రాజమ్మ సైతం తమను నిత్యం చీవాట్లు పెడుతుందని ఆవేదన వ్యక్త చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ వారిరువురిని విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు.

Comments

comments