Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

ప్రారంభానికి సిద్ధమైన కమాండ్ కంట్రోల్ కార్యాలయం

new

మన తెలంగాణ/సిద్దిపేట టౌన్ : సిద్దిపేట జిల్లా ఏర్పాటుకు ముందే మంజూరైన పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ జిల్లా కార్యాలయం ప్రారంభానికి సిద్ధ్దమైంది. భవిష్యత్ అవసరాలను గుర్తుచుకుని మంత్రి హరీశ్‌రావు ముందుచూపుతో సిద్దిపేటకు పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ కార్యాలయాన్ని మంజూరు చేయించారు. కేవలం జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే ఈ కార్యాలయం సిద్దిపేట జిల్లా ఏర్పడక ముందే మనకు మంజూరైంది. పట్టణ శివార్లలోని పొన్నాల వద్ద దీన్ని నిర్మించారు. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించడమే కాకుండా అవసరమైన ఏర్పాట్లను జిల్లా కేంద్రం నుంచి తీసుకునే అవకాశం ఏర్పడుతుంది.  కమిషనరేట్ పరిధిలో మెరుగైన పోలీసు సేవలకు ఈ కార్యాలయం ఎంతగానో ఏర్పడుతుంది. జిల్లా ఏర్పాటైన తరువాత పూర్తిస్థాయి జిల్లా కార్యాలయంగా దీన్ని చెప్పుకోవచ్చు. త్వరలోనే దీన్ని ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

comments