Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

మార్చి నెలాఖరులోపు రెండు పడక గదుల నిర్మాణం పూర్తి

rooms

*సింగిరెడ్డి పాలెం, కుతుబ్షాపురంలో రెండు పడక గదుల గృహ సముదాయాన్ని పరిశీలించిన కలెక్టర్ సురేంద్రమోహన్

మన తెలంగాణ/సూర్యాపేట
సింగిరెడ్డి పాలెంలోని రెండు పడక గదుల గృహ నిర్మాణ సముదాయాన్ని మార్చి నెలాఖరు వరకు పూర్తి చేసి పేద ప్రజలకు అందిస్తామని జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ తెలిపారు. గురువారం పెన్‌పహాడ్ మండలంలోని సింగిరెడ్డి పాలెంలో రెండు పడక గదుల ఇళ్ల పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న రెండు పడక గదుల గృహ సముదాయం పనులను త్వరితగతిన పనులు పూర్తి అయ్యేలా కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని సీఎం దత్తత గ్రామం అయిన ఎర్రవల్లి తర్వాత అందరికీ ఇళ్లు కలిగిన గ్రామంగా సూర్యాపేట జిల్లాలోని సింగిరెడ్డి పాలెం నిలుస్తుందని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటకి తాగు నీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్.డబ్లూ.ఎస్ అధికారులను ఆదేశించారు. సింగిరెడ్డిపాలెం గ్రామంలోని 128 జిప్లస్ వన్ పద్దతుల్లో నిర్మితమైన ఈ గృహ సముదాయంలో 215 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 102 మందిని గ్రామ సభ ద్వారా ఆర్డీవో సమక్షంలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లా లోని నాలుగు నియోజకవర్గాలలో రెండు పడక గదుల గృహ సముదాయాల నిర్మాణాల పనులు చురుకుగా సాగుతు న్నా యని, వచ్చే రెండు నెలల్లో దాదాపు 1000 గృహములు పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగు తుందని తెలిపారు. అనంతరం సింగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కె.నాగయ్య అనే గొర్రెల కాపరిని ఆపి గొర్రెల సబ్సిడీ పథకం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మా గ్రామానికి ఇంకా గొర్రెల యూనిట్లు అందలేదని తెలపగా వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ త్వరలో గొర్రెల యూనిట్లు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్య క్రమంలో ఈఈ ఆర్ అండ్ బి యాదగిరి, డిప్యూటీ ఈఈ మైపా ల్‌రెడ్డి, తహసీల్దార్ సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన గృహాలను అందించాలి
కుతుబ్షాపురంలో రెండు పడకల గృహాల నిర్మాణం మోడల్ కాలనీగా నిర్మించాలి
కుతుబ్షాపురంలో నిర్మిస్తున్న రెండు పడకల గృహాలను ఇంట్రా మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దాలని కలెక్టర్ కె.సురేంద్రమోహన్ తెలిపారు. గురువారం కుతుబ్షాపురంలో నిర్మిస్తున్న రెండు పడకల ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన ఇళ్లను అందించడంతో పాటు వారికి అవసరమైన మౌలిక వసతుల ను కల్పించేలా చర్యలు చేప ట్టాలని అధికారులను ఆదేశిం చారు. ఇళ్ల్ల నిర్మాణం వేగవం తం చేయాలని, పనుల జాప్యం పై అధికారులను అడిగి తెలుసు కున్నారు. ఈ సంద ర్భంగా ఇ సుక రవాణాకు తీవ్ర ఆటంకం జరుగుట వలన కొంత ఆల స్యం జరిగిందని వివరించ గా, వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ తహసీల్దార్, ఆర్ అండ్ బి, పంచాయితీ రాజ్ ఇంజ నీ రింగ్ అధికారులు, పోలీసు శా ఖల సహకారంతో రెండు పడక గదు ల నిర్మాణాలకు అవసరమైన ఇసుకను నిరాటంకంగా అందించాలని ఆర్డీవోకు సూచించారు. అంతేగాక వేములూరు వాగు నుంచి సీతారాంపురం గ్రామం లో నిర్మిస్తున్న రెండు పడకల గదుల ఇళ్లకు ఇసుక రవాణా చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా జిల్లాలో ప్రస్తుతం నిర్మిస్తున్న రెండు పడకల ఇళ్లకు ప్రతి ఇం టింటికి ఖచ్చితంగా ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇంకుడు గుంత నిర్మించేందుకు సరిపడ స్థలం లేని పక్షంలో ఇళ్ల చివరన ఒక బావిని ఏర్పాటు చేసుకొని ఆ నీటితో వ్యవసాయ, కూరగాయల సేద్యానికి ఉపయోగించు కునేలా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా రెండు పడకల గదుల నిర్మాణంలో ఎటువంటి అవకతవకలకు ఆస్కా రం లేకుండా మీ యొక్క సొంత ఇంటి లాగా పకడ్బందీగా నిర్మించి అర్హులైన పేద ప్రజలకు అందించాలన్నారు. అదే విధంగా పెన్‌పహాడ్ మండలంలోని దూపహాడ్ గ్రామంలో రెం డు పడక గదుల నిర్మాణానికి వెంటనే ఫౌండేషన్ ఏర్పాటు చేయుటకు తగు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికా రులను ఆదేశిం చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి ఈఈ కె. వెంకటయ్య, ఏడబ్లూఈ పవన్‌కుమార్, సంబంధిత అధికారు లు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments