Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

అన్ని రకాల భూములపై సమగ్ర నివేదిక

MEETING*వికారాబాద్ జిల్లా కలెక్టర్ సయ్యద్ ఓమర్ జలీల్

మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా : ప్రభుత్వ, ప్రభుత్వేతర, దేవాలయ, అటవీ, వక్ఫ్, భూదానం భూములను గుర్తించి సమగ్ర నివేదికలను జనవరి 20వ తేదీలోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ సయ్యద్ ఓమర్ జలీల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో భూప్రక్షాళన ప్రక్రియ పురోగతిపై రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూప్రక్షాళన కార్యక్రమాన్ని ఎటువంటి అవకతవకలు లేకుండా స్పష్టమైన రికార్డులను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఎకరాకు ఒక పంటకు 4 వేల రూపాయల చొప్పున వ్యవసాయ పెట్టుబడికి ఇవ్వనున్న దృష్టా వ్యవసాయ సాగు భూములను మాత్రమే గుర్తించి పట్టా పాసు పుస్తకాల్లో సక్రమంగా నమోదు చేసేందుకు వీలుగా కంప్యూటరీకరణ గావించాలని ఆయన అధికారులకు సూచించారు. రెండవ విడతగా నియోజకవర్గానికి వెయ్యి డబుల్ బెడ్‌రూంలు మంజూరు చేసిందని అందుకు అవసరమైన భూమిని గుర్తించాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవోలు విశ్వనాథం, వేణుమాధవరావు, సంచాయతీరాజ్ ఇఇ మనోహర్‌రావు, డిఎఫ్‌ఓ శ్రీలక్ష్మి, భూమి కొలతల సహాయ సంచాలకుడు సదాశివుడు, కలెక్టర్ పరిపాలనాధికారి శ్రీనివాస్‌తోపాటు పలు మండలాల తహసీల్దార్లు  పాల్గొన్నారు.

Comments

comments