Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

వలస జీవులపై వల

int*ఉద్యోగ వీసాలకు ‘కండక్ట్’ కంపల్సరీ
* కేసులు, నేరారోపణ ఉన్న వారికి గల్ఫ్‌లో నౌకరీ కష్టమే
* తాజాగా ఆదేశాలు జారీ చేసిన దుబాయి

ఆదిలాబాద్ : వలస జీవులపై మరో పిడుగు పడింది. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి మరో శరాఘాతం తగిలింది. దుబాయి దేశం ఇక నుంచి తమ దేశానికి ఉపాధి కోసం వచ్చే వారందరూ కండక్ట్(సత్ప్రవర్తన ధృవీకరణ పత్రం) సమర్పించాలని నిబంధన జారీ చేసింది. ఈ కండక్ట్ సర్టిఫికెట్ లేని వారు ఇక నుండి ఉపాధి కోసం దుబాయి దేశానికి రావడం కుదరదు. ఒక వేళ కండక్ట్ సర్టిఫికెట్ లేనట్లయితే వారిపై కఠిన చర్యలు సైతం ఆ దేశం తీసుకోబోతుంది. ప్రస్తుతం ఆ దేశంలో ఉపాధి పొందుతున్న వారిని మాత్రం మినహాయించి కొత్తగా వచ్చే వారందరికీ ఈ నిబంధనను అమలు చేయబోతుంది. అయితే ప్రస్తుతం శిక్ష పొందిన వారు, కేసుల్లో ఇరుకున్న వారు నేరారోపణలు ఎదుర్కొంటున్న వారందరూ ఉపాధి కోసం దుబాయి దేశానికి వెళ్లడం ఇక సాధ్యం కాదు. ఇప్పటికే కువైట్ దేశం ఈ విధానాన్ని అమలు చేస్తుంది. వర్క్ పర్మిట్ వీసా పొందాలనుకునే వారంతా తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ల నుంచి సత్ప్రవర్తన ధృవీకరణ పత్రాలు పొంది వాటిని ఎంబసీ కార్యాలయం ద్వారా మరో సారి ధృవీకరించాల్సి ఉంటుంది. దుబాయి దేశంలో భద్రత కారణాల దృష్ట్యా ఈ సత్ప్రవర్తన ధృవీకరణ పత్రం విధానాన్ని దుబాయి దేశం అమలు చేయబోతుంది. రాబోయే ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేసేందుకు దుబాయి నిర్ణయించింది. ఈ విషయాన్ని అన్ని దేశాల ఎంబసీ కార్యాలయాలకు తెలిపింది. అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాది మంది దుబాయి దేశంలో ఉపాధి పొందుతున్నారు. కొంత మంది కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. మిగతా గల్ఫ్ దేశాల కన్నా దుబాయి దేశానికే ఎక్కువ సంఖ్యలో జిల్లా వాసులు ఉపాధి కోసం వలస వెళ్తుండడం సహజం. ప్రతి ఏటా వందల మంది దుబాయి దేశానికి వలస బాట పడుతున్నారు. అయితే ఇలాంటి వారందరు ఇక కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడబోనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో సతమతమవుతున్న వారు, పేదరికంలో మగ్గుతున్న వారు బతుకుదేరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తుండడం రివాజుగా మారింది. ఇప్పటికే అనేక సమస్యలు ఎదుర్కొంటున్న గల్ఫ్ వలస బాధితులకు దుబాయి దేశం తీసుకున్న నిర్ణయం శాపంగా మారబోతుందంటున్నారు.

Comments

comments