Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలి

collector

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: మల్ల న్నసాగర్ ప్రాజక్టుకు అందరూ సహకరించా లని ముంపు బాధితుల పక్షాన తానుంటానని కలెక్టర్ వెంకటరామిరెడ్డి హామీ ఇచ్చా రు. శనివారం సిద్దిపేట కలెక్టరేట్‌లో మల్లన్న సాగర్ ప్రాజక్టు నిర్మాణంలో భాగంగా గజ్వే ల్ నియోజకర్గం పరిధిలోని కొండపాక మం డలం సింగారం గ్రామ ముంపు బాధితుల తో కలెక్టర్ మాట్లాడారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో జిల్లా చరిత్రలో నిలచిపోనున్న దని అన్నారు. తాను రైతు బిడ్డనేనని రైతుల కు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వ నని స్పష్టం చేశారు. గ్రామస్థులు ఎట్టి పరిస్థి తుల్లో అధైర్యపడవద్దని మీ ఇంటి మనిషిగా అండగా ఉంటానని అన్నారు.  కొండపోచ మ్మ జలాశయం ముంపుకు గురవుతున్న మామిడ్యాల, తానేదార్‌పల్లి, బైలంపూర్ గ్రా మస్థులకు తున్కి బొల్లారంలో 25 లక్షల వి లువైన మంచి ప్లాట్, ఇళ్లు ప్రభుత్వం కట్టి స్తుందని ఇంతకంటే ఇంకేంకావాలని సింగారం గ్రామస్థులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. భూసేకరణకు ప్రజలందరూ సహకరించాలని సర్వేకు వచ్చే టీ మ్‌లకు మద్దతు నివ్వాలని సూచించారు. ఈ సమావేశంలో జె సి పద్మాకర్, గజ్వేల్ ఆర్డీవొ విజయేందర్‌రెడ్డి, ఇరిగేషన్ ఈఈ ఆనంద్, తహసీల్దార్ ఆరిఫాలు పాల్గొన్నారు.

Comments

comments