Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

రూ.9 కోట్ల విలువైన వొడ్కాబాటిల్ ను ఎత్తుకెళ్లారు…

Vodka-Bottle

కోపెన్ హగెన్: అత్యంత ఖరీదైన వస్తువు అపహరణకు గురైన సంఘటన డెన్మార్క్ లోని వెస్టెబ్రోలో చోటుచేసుకుంది. కేఫ్ 33 బారులో   రూ.9 కోట్ల విలువైన వొడ్కా బాటిల్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో బారు యజమాని బ్రియాన్ ఇంగ్ బర్గ్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దొంగ మాస్క్ ధరించి వొడ్కాబాటిల్ ను దొంగలించాడు. ఈ బాటిల్ ను మూడు కిలోల బంగారం, మూడు కిలోల వెండి తో తయారుచేసినట్టు బారు యాజమాని తెలిపాడు. ప్రస్తుతం తమ బారులో 1200 బాటిళ్లు ఉన్నాయని వాటిలో ఈ బాటిల్ అత్యంత విలువైందని చెప్పాడు. ఇలాంటి ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమని చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

comments