Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

చిన్నారిని చితక బాదిన డ్యాన్స్ మాస్టర్

Student

మన తెలంగాణ/ఎల్బీనగర్: పాఠశాలలోని డ్యాన్స్ క్లాసులో డ్యాన్స్ సరిగా చేయలేదని ఓ చిన్నారిని డ్యాన్స్ మాస్టర్ చితక బాధిన సంఘటన శనివారం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేటలో వెలుగులోకి వచ్చింది. కొత్తపేటలోని కృష్ణవేణీ నగర్‌లో శ్రీ చైతన్యటెక్నో స్కూల్‌లో అక్షయ (8) 4వ తరగతి చదువుతుంది. పాఠశాలలో జరుగుతున్న డ్యాన్స్ క్లా సులలో అక్షయ సరిగా డ్యాన్స్ చేయడం లేదనే నె పంతో గురువారం డ్యాన్స్ మాస్టర్ ఆచిన్నారిని చెంపలపై కొట్టడంతో చెంపలు ఉబ్బాయి. స్కూల్ ముగిసిన తర్వాత ఇంట్లో తల్లి తండ్రులకు విషయం అక్షయ చెప్పలేదు. శుక్రవారం స్కూల్‌కు పోలేక, శ నివారం కూడా స్కూల్‌కు వెళ్లమంటే అక్షయ భ యాందోళనకు గురికావడంతో అక్షయ మామయ్య రాజేష్, కుటుంబ సభ్యులు ఆరా తీశారు. స్కూల్‌లో డ్యాన్స్ మాస్టర్ అక్షయను కొట్టినందుకు బయపడి స్కూల్‌కు వెళ్లడం లేదన్న వి షయం తెలుసుకున్న అక్షయ మా మయ్య రాజేష్ పాఠశాలకు వెళ్లి ప్రి న్స్ పల్, డ్యాన్స్ మాస్టర్ ప్రభాకర్ ను నిలదీశాడు. వారు పొంతన లే ని సమాధానాలు చెప్పడంతో చి న్నారి నిచితక బాధిన పాఠశాల యాజమాన్యం, ప్రిన్స్‌ప ల్, డ్యాన్ మాస్టర్‌పై సరూర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ మ న్మోహన్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

10 చిన్నారులను చితక బాదారు: అచ్యుత్ రామ శ్రీ చైతన్య టెక్నోస్కూల్ కొత్తపేటలో డ్యాన్ సరిగా చే యడం లేదని పాఠశాల డ్యాన్ మాస్టర్ ప్రభాకర్ 10 మం ది చిన్నారులను చితక బాధినట్లు తనకు త ల్లితండ్రులు, ఇతరుల నుంచి సమాచారం అందింద ని రాష్ట్ర బా లల హక్కుల సంఘం అ ధ్యక్షులు అచ్యుత్ రామ అన్నారు. శనివారం బాలల హక్కుల చట్టం కింద చిన్నారులను కొడుతున్నా స్పందించని ప్రిన్స్‌పల్, డ్యాన్స్ మాస్టర్ ప్రభాకర్‌పై చట్టపరంగా చర్య లు తీసుకోవాలని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫి ర్యాదు చేశారు.

Comments

comments