Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

తల్లికి పెళ్లి చేసిన కూతురు

GEETA

జైపూర్ : కన్న తల్లికి ఓ కూతురు రెండో పెళ్లి చేసింది. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. జయపురకు చెందిన గీత అనే మహిళ భర్త మరణించి ఒంటరితనంతో కుంగిపోతుంది. గీత కుమార్తె సన్హిత ఉద్యోగ రీత్యా మరో ప్రాంతంలో ఉంటోంది. గీతను చూసుకునే వారు లేక ఆమె ఆరోగ్యం దెబ్బతింది. తల్లి గీత బాధను చూడలేని సన్హిత తన తల్లికి ఓ తోడు అవసరమని భావించింది. ఈ క్రమంలో తల్లికి జోడీని వెతికే పనిలో పడిన సన్హిత భార్య చనిపోయి ఒంటరిగా ఉన్న గుప్తా అనే వ్యక్తి గురించి తెలుసుకుంది. గుప్తా తన ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకునేందుకు ఓ తోడు అవసరమని భావించాడు. ఈ క్రమంలో గీతను గుప్తా రెండు పెళ్లి చేసుకున్నాడు. సన్హిత పెళ్లి పెద్దగా ఉండి గీత, గుప్తల పెళ్లి చేసింది. దీంతో బంధువులు సన్హితను తిట్టిపోశారు. అయితే తన తల్లి గీత క్షేమం కోసమే రెండో పెళ్లి చేశానని సన్హిత చెప్పింది. ఇప్పుడు గీత, గుప్తాలు ఒకరికొకరు తోడుగా ఉంటుండడంతో సంతోషంగా ఉందని సన్హిత పేర్కొంది.

Daughter to Marriage her Mother with another Person

Comments

comments