Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

ఘట్ కేసర్ లో రైలు పట్టాలపై మృతదేహం

Suicide-on-Train-Tracks

ఘట్ కేసర్:  మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దీంతో రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని… మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. మృతుడిని ఓల్డ్ రామంతాపూర్ చెందిన సంతోష్(26)గా గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారమందించారు.  మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఘట్ కేసర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కాగా సంతోష్‌ది హత్యా లేక ఆత్మహత్యా అని తేలాల్సిఉందని పేర్కొన్నారు.

Comments

comments