Search
Sunday 21 January 2018
  • :
  • :

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఉపాధ్యాయులపై చర్యలకు డిమాండ్

madam

మన తెలంగాణ/సంగారెడ్డి టౌన్ : విధుల్లో నిర్లక్షం వహిస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా నగర కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ జిల్లాలోని కొన్ని మండలాలు ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరుకావడం లేదన్నారు. గతంలో ఎమ్మార్పీ వ్యవస్థ ఉన్నప్పుడు ఎమ్మార్పీగా చేసిన ఉపాధ్యాయులు విధ్యాభోధనకు ఆటంకం కలుగుతుందని, ఎమ్మార్పీ వ్యవస్థను ప్రభుత్వం రద్దుచేసిందని, ఎమ్మార్సీ కార్యాలయంలో ఎమ్‌ఐసీ కోఆర్డినేటర్‌గా, డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా సీఆర్‌పీలను నియమించింది. కానీ జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్‌కల్‌తో పాటు జిల్లాలో ఇంకా కొన్ని మండలాల్లో గతంలో ఎమ్మార్పీగా పనిచేసిన ఉపాధ్యాయులు సంవత్సరాల తరబడి పాఠశాల విధులకు హాజరుకాకుండా ఎమ్‌ఆర్‌సీ కార్యాలయంలో పనిచేస్తున్నారన్నారు. ఈ విషయాలన్నింటిని ఎంఈవోల దృష్టికి తీసుకెళ్లినా వారు నిర్లక్షం వహిస్తున్నారన్నారు. ఇందులో కొంతమంది ఉపాధ్యాయులు ఆఫీసు పని అని పాఠశాల విధులకు హాజరుకావడం లేదన్నారు. ఇలాంటి ఉపాధ్యాయులపై జిల్లా విద్యాధికారి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గసభ్యులు సంగమేశ్వర్, శ్రీకాంత్, విజయ్, ప్రియాంక, సింధు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments