Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

‘నేతి’కి పలువురి పరామర్శ

neti

డిప్యూటీ చైర్మన్ నేతికి మాతృ వియోగం

 కేతేపల్లి : శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌కు మాతృవియోగం జరిగింది. ఆయన మాతృమూర్తి నేతి రాధమ్మ (94) అనారో గ్యానికి గురై హైద్రాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెం దింది. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని నేతి స్వగ్రా మమైన నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకు పల్లి గ్రామానికి తీసుకొ చ్చారు. సంతాప వార్త తెలు సుకున్న శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, రాజ్యసభ్య సభ్యుడు, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.కేశవరావు, ఎంపీ గుత్తా సుఖేంద ర్‌రెడ్డి చెరుకుపల్లి గ్రామానికి చేరుకొని నేతి రాధమ్మ పార్ధివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. మృతి కి గల కారణాలు తెలుసుకొని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
నేతికి ప్రముఖుల పరామర్శ
శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ మాతృ మూర్తి నేతి రాధమ్మ అంత్యక్రియలను మండలం లోని చెరుకుపల్లి గ్రామంలో సోమవారం జరిగాయి. హైద్రా బాద్‌లో నిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందిన రాధమ్మ పార్ధివ దేహాన్ని స్వగ్రామమైన చెరుకుపల్లికి తీసుకొచ్చారు. రాధమ్మ మృతి వార్త రాష్ట్ర వ్యాప్తంగా దావనంలా వ్యాపిం చడంతో రాష్ట్రంలోని మంత్రులు, వివిధ పార్టీ రాజకీయ నేతలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున చెరుకుపల్లికి చేరుకొని రాధమ్మ మృతదేహానికి నివాళు లర్పించారు. నేతి విద్యాసాగర్‌ను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె అంత్య క్రియలు పూర్త య్యేంతవరకు నేతితో పాటు ఉన్నారు. రాధమ్మకు నలుగురు కుమారులు, నలుగురు కూతుర్లు. చిన్నకుమా రుడైన నేతి మురళి దహన సంస్కారాలు నిర్వ హించారు. పరామర్శించిన వారిలో మంత్రి గుంతకండ్ల జగదీష్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, కె.కేశ వరావు, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, భాస్కర్‌రావు, జడ్పీ చైర్మన్ బాలు నాయక్, ఎమ్మె ల్సీలు కర్నె ప్రభాకర్‌రావు, పూల రవీందర్, ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య, నల్లగొండ, సూర్యాపేట జిల్లా కలెక్టర్ లు గౌరవ్ ఉప్పల్, సురేంద్ర మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్థ న్‌రెడ్డి, ఎస్పీ శ్రీని వాస్‌రావు, నాయకులు డాక్టర్ చెరుకు సుధా కర్, గోలి మధు సూద న్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాద వ్, కంచర్ల భూపాల్ రెడ్డి, గుత్త మం జుల మాధ వరెడ్డి, లింగాల మల్లేశ్వరీ వెంకన్న, పెండెం ధనలక్ష్మి సదా నం దం, బంటు మహేందర్, బంటు స్వరూప, కొమి రిశెట్టి వెంకట్మ్రణ, వంగూ రి రాము, బత్తుల దయాకర్ రెడ్డి, దోనాల సాయిరెడ్డి ఆయా గ్రామాల సర్పం చ్‌లు, ఎంపీటీసీలు, పలు పార్టీ నాయకులున్నారు.

Comments

comments