Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

అక్రమ రవాణాను నిరసిస్తూ ధర్నా

cong

*ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ ధ్వజం 

మన తెలంగాణ / సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో ఇసుక అక్రమ రవాణాను నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ గౌడ్, మాజీ మంత్రులు తాటిపర్తి జీవన్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కటుకం మృత్యుంజ యం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కెకె మ హేందర్ రెడ్డి, రమ్యారావు, ప్రవీణ్, మహేశ్, జయపాల్‌తో పాటుగా స్థానిక నా యకులు నాగుల సత్యనారాయణ గౌడ్, బుర్ర నారాయణ గౌడ్, సంగీతం శ్రీనివాస్, వైద్య శివస్రసాద్, ఆకునూరి బాలరాజు, మడుపు శ్రీదేవి, వడ్డెపల్లి వనిత, ఆడెపు చంద్రకళ తదితరులు అనేకమంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు ఇసుక అక్రమ రవాణాకు సిఎం కెసిఆర్ కుటుంబం అండగా ఉంటోందని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డువచ్చిన వారిని, లారీలు, ట్రక్కులు, ట్రాక్టర్లతో తొక్కించి చంపుతున్నారన్నారు. కామారెడ్డిజిల్లాలో విఆర్‌ఎ సాయిలును ఇసుక స్మగ్లర్లు హత్యచేస్తే అతను విఆర్‌ఏనే కాదనడం ఎంతవరకు సమంజసమన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడుతున్న తెరాస నాయకులు సహజవనరుల దోపిడి ఇష్టారాజ్యంగా సాగిస్తున్నారన్నారు. గవర్నర్ కూడా తెరాస నాయకులకు వంతపాడటం ఏమిటన్నారు. ప్రజలు చైతన్యవంతులైతేనే అవినీతిని అంతం చేయొచ్చన్నారు. పాలకులకు తగిన గుణపాఠం నేర్పించొచ్చని తెలిపారు. ఇసుక రవాణా వల్ల భూగర్భజలాలు నాలుగు మీటర్ల లోతుకు వెళ్లిపోయి రైతులు సాగునీరు, తాగునీరందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అబద్దాలతో అధికారంలోకి వచ్చిన తెరాస ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. తెరాస నాయకుల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పలు రకాల వేధింపులకు దిగుతున్నారన్నారు. నేరెళ్ల ఘటనపై చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టారు. సిరిసిల్లలో ముఖ్యమంత్రి కుమారుడు మంత్రి కెటిఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నాడన్నారు. పోలీసులు, జిల్లా ఉన్నతాధికారులు మంత్రి చెప్పుచేతుల్లో ఉన్నారన్నారు. ఇప్పటికైనా ఉద్యోగుల తీరు మారాలన్నారు.

Comments

comments