Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

ప్రత్యక్ష పన్ను వసూళ్లు 18 శాతం వృద్ధి

MNY

ఏప్రిల్‌డిసెంబర్‌లో రూ.6.56 లక్షల కోట్లు

న్యూఢిల్లీ : ప్రభుత్వ ప్రత్యక్ష పన్ను వసూళ్లు 18.2 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌డిసెంబర్ కాలంలో రూ.6.56 లక్షల కోట్లు వసూళు అయినట్టు ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. 201718 బడ్జెట్ అంచనాలో మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.9.8 లక్షల కోట్లకు గాను ఇప్పటివరకు 67 శాతం వసూళ్లు వచ్చాయి. వ్యక్తిగత పన్ను, కార్పొరేట్ పన్ను, సంపద పన్నులు వంటివి ఈ ప్రత్యక్ష పన్నుల్లో ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో రీఫండ్ నగదు రూ.1.12 లక్షల కోట్లు ప్రభుత్వం జారీ చేసింది. రీఫండ్‌కు సర్దుబాటు చేయడానికి ముందు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.7.68 లక్షల కోట్లతో 12.6 శాతం పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక అడ్వాన్స్ పన్ను వసూళ్లు కూడా 12.7 శాతం పెరిగి రూ.3.18లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ అడ్వాన్స్ పన్నుల్లో కార్పొరేట్ ఆదాయపు పన్ను వసూళ్లు 10.9 శాతం, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 21.6 శాతం పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ అంచనా వేసిన ప్రత్యక్ష వసూళ్ల లక్ష్యాన్ని అధిగమించింది. బడ్జెట్ అంచనాల్లో రూ.8.47 లక్షల కోట్లకు గాను రూ.8.49 లక్షల కోట్లు నమోదు చేసింది. అంచనా కంటే ఎక్కువగానే వసూళ్లు రాబట్టింది.

Comments

comments