Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

దీపం పథకం కింద సిలెండర్ల పంపిణీ

cylinder

మన తెలంగాణ / సారంగాపూర్ : మండల కేంద్రంలో బుధవారం దీపం పథకం లబ్దిదారులకు డీఎస్‌వో సుదర్శన్, మార్కెట్‌కమిటీ చైర్మన్ రాజ్‌మహ్మద్‌లు సిలెండర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు వంట చెరుకుతో వంటలు చేస్తు పొగతో ఆనారోగ్యానికి గురవుతున్నారని, దీంతో అడవులు అంతరించి పోతున్నాయని ప్రభుత్వం దీన్ని గుర్తించి రాయితీ రూపంలో గ్యాస్ సిలెండర్లను పంపిణీ చేయడం జరుగుతుందని మండలంలో 965 రాయితీ సిలెండర్లు మంజూరైనట్లు తెలిపారు. కావాల్సిన వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్యాంసుందర్, ఎంపిడివో గంగాధర్, జడ్పీటీసీ రోడ్డ సునీత మారుతి, డీటీ శ్రీధర్, ఏపీవో తుల రామకృష్ణ, ఆర్‌ఐ తెలాంగ్ రావ్, వీఆర్వో ప్రకాష్, గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ సుభాష్, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments