Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

గొర్రెల పంపిణీలో జిల్లానే ఫస్ట్: కలెక్టర్ గౌరవ్ ఉప్పల్

table

*గొర్రెలను అక్రమంగా తరలిస్తే సహించేది లేదు
*కలెక్టర్ గౌరవ్ ఉప్పల్

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్‌లో పంచాయితీ అధికారులు, పశుసంవర్థక శాఖ అధికారులు, అంగడి గుత్తే దారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ సబ్సిడీ గొర్రెలు ఇతర రాష్ట్రాలకు అమ్మడానికి అంగడికి వచ్చిన గొర్రెలను అమ్మకుండా మార్కెట్ గుత్తేదారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మార్కేట్‌కి చెవి పోగులు ఉన్న గొర్రెలుగానీ, గొర్రెల చెవులకు రంధ్రాలు ఉన్న గొర్రెలు గానీ , చెవికి కోతలు ఉన్న గొర్రెలు గానీ వచ్చినట్లయితే ఆ గొర్రెలను లబ్ధీదారులకు సబ్సిడీ కింద ఇచ్చిన గొర్రెలుగా గుర్తించాలని వాటిని అమ్మకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అంగడిలో బ్యానర్‌లను ఏర్పాటు చేయించాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. జిల్లాలో నిర్వహించబడే అంగడిలకు ఇతర జిల్లాల నుండి గొర్రెలను తీసుకొచ్చి అమ్ముతూ, వాటి సహాకారంతో ప్రభుత్వం అందజేసిన గొర్రెలను తారుమారు చేసే అవకాశం ఉందని, అంగడ్లలో ప్రభుత్వం పంపిణీ చేసిన ఒక్క గొర్రె కూడా ఉండకుండా సంబంధిత సిబ్బంది అంగడీలు నిర్వహించే ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తూ ఉండాలని ఆయన అన్నారు.

ఇతర జిల్లాల నుండి నల్లగొండ జిల్లాకు వచ్చిన గొర్రెలను ఎట్టి పరిస్థితుల్లోను, ఏ మార్గం ద్వారానైనా ఇతర జిల్లాలకు తరలించడం సహించేదిలేదని వారిపై కేసులు పెట్టి గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. కొందరు మత్యకారులు తమ బోట్లలో ఇతర జిల్లాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వాటిని నివారించేందుకు పోలీస్ శాఖ వారు గట్టి నిఘా ఏర్పాటు చేసి అట్టి బోట్లను వెంటనే తమ ఆదీనంలోకి తీసుకోవాలని, గొర్రెలను తరలించే వారిపై కేసులు నమోదుచేసి వారికి శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో గొర్రెల పంపిణీలో నల్లగొండ జిల్లా ముందున్నందున ఇక్కడ రీసైక్లింగ్‌గానీ, రీసేల్‌గాని ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఆయన అన్నారు. అడవిదేవులపల్లి, ఖంబాలపల్లి, పొగిల్ల సర్కిల్ తండా, చందంపేట బోటింగ్ పాయింట్ల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. జిల్లాలో ఉన్న రెండు చెక్‌పోస్టుల వద్ద కేటాయించబడిన అన్ని శాఖల సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోను గొర్రెలను వేరే ప్రాంతాలకు తరలించకుండా చూడాలని ఆయన అన్నారు. జిల్లాలో యాదవుల భాగోన్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి వారి ఆర్థిక స్తోమతను పెంచేందుకు చర్యలు తీసుకుంటుందని, దీన్ని కొందరు దళార్లు లిబ్దిదారులను మభ్యపెట్టి వారి స్వలాభం కోసం గొర్రెలను రీసైక్లింగ్ చేసి రీసేల్ చేసేందుకు చూస్తున్నారని వీటిని గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రటరీలు, సర్పంచ్‌లు, సంఘాల నాయకులు ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తెచ్చినట్లయితే సంబంధిత వ్యక్తులపై పోలీస్ వారు కేసులు నమోదు చేస్తారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ జేడీఎహెచ్ రమేష్, డీపీఓ శీకాంత్, డివిజనల్ పంచాయితీ అధికారులు, గ్రామ పంచాయితీ, అంగడి గుత్తేదారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments