Search
Wednesday 24 January 2018
  • :
  • :
Latest News

సర్కారు బియ్యానికి రీసైక్లింగ్ చెద?

rice

– రీసైక్లింగ్,డబుల్ పాలిష్
– కోట్లలో వ్యాపారం
– ఇంటి దొంగల్లో గుబులు

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: ట్రిపుల్ దమాఖా.. చౌక బియ్యం రీసైక్లింగ్‌లో అక్రమార్కులకు సన్న బియ్యం సరఫరా ఓ వరంలా మారింది. ముఖ్యంగా రేషన్ డీలర్లు ఇతరుల నుండి బియ్యాన్ని చౌక ధరకు కొనుగోలు చేసి తిరిగి ప్రభుత్వానికి అమ్మడం ఒక ఎత్తుకాగా వాటినే అధికంగా పాలిష్ చేసి సన్న బియ్యంగా మార్చి ప్రభుత్వానికే సరఫరా చేస్తే వచ్చే లాభం మూడిం తలుగా ఉంది. అయితే ఒక్క సారిగా రీసైక్లింగ్, డబుల్ పాలిష్ బియ్యాన్ని కాక ప్రతి నెలా కొన్ని ప్రాంతాలకు ,లేదా కొంత కొంత సరఫరాచేసి విద్యార్థు ల నుండి మూకుమ్మడిగా ఆందోళన రేగకుండా జాగ్రత్త పడ్డట్లు తెల్సింది. సన్న బియ్యం సరఫరాలో కోట్ల రూపాయలు దండుకున్నారు. చౌక బియ్యాన్ని రూ. 10కి కొనుగోలు చేసి అదేబియ్యాన్ని రూ.27కు ప్రభుత్వానికి అంటగ ట్టారు. ఇక ఆదే బియ్యాన్ని బాగా పాలిష్ చేసి సన్న బియ్యంగా మార్చి ప్రభు త్వానికి కిలో రూ.32కు సరఫరా చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎస్‌సి హాస్టల్లు 37 బిసి హాస్టళ్ల 28,ఎస్టీ హాస్టళ్లు 26 ఉండగా కెజిబి వి హాస్టళ్లు 21 ఉన్నాయి. ఇంకా రెసిడెన్సియల్ ,మినీ గురుకు లాలు మైనారిటీ ఇతర హాస్టళ్లు మొత్తానికి ప్రతి నెల దాదాపు ఆరు వేల క్వింటాళ్ల సన్న బియ్యం సరఫరా అవుతున్నాయి. ప్రతి నెల వీటి విలువ దాదాపు రెండు కోట్ల రూపాయలుగా ఉన్నట్లు తెల్సింది. అంటే రూ.60లక్షల పెట్టుబడితో దాదాపు రెండు కోట్ల ఆదాయం అక్రమార్కుల జేబుల్లోకి వెలుతున్నట్లు తెల్సింది. ఈ విషయంలో కొద్ది నెలల నుండి ఎలాంటి సన్న బియ్యం సరఫరా అయ్యాయన్న విషయంపై కూడా విచారణ జరిపితే అసలు విషయం బయట పడ్తుందని పలువురు అభిప్రాయ పడ్తున్నారు.
ఇంటిదొంగల బెంబేలు: జిల్లాలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ వ్యవహారం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకు నల్లేరు మీద బండిలా నడక సాగించిన అక్రమా ర్కులతో పాటు తెర వెనుక వారికి వెన్నుదన్నుగా ఉండి కథ సాఫీగా నడిపిస్తున్న అధికార వర్గాల్లో కూడా అలజడి మొదలయింది . చౌక బియ్యం రిసైక్లింగ్ వ్యాపారులపై ప్రస్తు తం కేసులు నమోదవుతుండగా వ్యవహారంలో నిద్రనటిస్తూ వచ్చిన జిల్లా పౌర సరఫరాల శాఖ ఉద్యోగులు కలవర పడుతున్నారు . రిసైక్లింగ్ ముఠా వ్యవహారాన్ని గుట్టుగా హ్యాండిల్ చేసి పట్టుకునేదాకా ఎక్కడా సమాచారం బయటకు పొక్కకుండా రాష్ట్రపౌర సరఫరాల కమీషనర్ తీసుకున్న చర్యలు ఎంత దాకా వెలతాయోనన్న భయం అటు వ్యాపారులతోపాటు అధికార వర్గా ల్లో కూడా నెలకొంది. ముఖ్యంగా ఇంటి దొంగల హస్తం లేకుండా ఇంత పెద్ద  ఎత్తున కేవలం వ్యాపారులే కొనసాగించే అవకాశాలు లేవని  తొలుత వ్యాపారుల పనిపట్టాక తదుపరి ఇంటి దొంగల ఏరివేతకు రంగం సిద్దం చేసనట్లు తెల్సింది.దీంతో  ఎప్పుడు ఎవరిపై వేటు పడ్తుందో , ఉన్నతా ధికారుల విచారణ ఏదిశగా సాగుతుందో తెలియక ఇంటి దొంగలు బెంబేలెత్తుతున్నట్లుతెల్సింది.

Comments

comments