Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

సార్.. దయచేసి ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ చేయకండి

ప్రొఫెసర్ వేధిస్తున్నాడని లేఖ రాసి విద్యార్థి అదృశ్యం

Strike

మన తెలంగాణ/హైదరాబాద్/అత్తాపూర్: ప్రొఫెసర్ వేధింపులు భరించ లేని ఓ విద్యార్థి కళాశాలను వదిలి అదృశ్యమైన ఘటన హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రా జేంద్రనగర్‌లోని ప్రొ. జయశంకర్ విశ్వవిద్యాలయంలో ఖమ్మం జిల్లాకు చెందిన రామునాయక్ బిఎస్‌సి మూడో సంవత్సరం చదువుతున్నాడు. రెండేళ్లుగా పరీక్షల్లో ఉత్తీర్ణుడవుతున్న రామునాయక్ కేవలం ప్రాక్టికల్స్‌లో మాత్రమే తప్పుతున్నాడు. అదేమని సంబంధిత విభాగం ప్రొ.అంజయ్య ను ప్రశ్నించాడు.

సోమవారం కూడా రామూనాయక్ తనను ప్రాక్టికల్స్ లో ఫెయిల్ చేయకండి సార్ అంటూ ప్రాధేయపడ్డాడు. అంజయ్య తన వద్దకు మళ్లీ రావొద్దు అంటూ బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన రామూనాయక్ తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఓ లేఖను రాసి హాస్టల్ వదిలి వెళ్లిపోయాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా రామూ నాయక్ హాస్టల్‌కు రాకపోవడంతో తోటి విద్యార్థులు ఆయన గదికి వెళ్ల్లి చూడగా ఓ లెటర్ లభించింది. లెటర్ చదివిన విద్యార్థులు వెంటనే కు టుంబసభ్యులకు సమాచారం అందించారు.

దీంతో వారు కళాశాలకు వచ్చి విద్యార్థులతో కలిసి రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశా రు. విద్యార్థ్ది విశ్వవిద్యాలయం నుంచి వెళ్లిపోవడానికి కారణమైన ప్రొ. అంజయ్యను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ కళాశాల ముందు బైఠాయించారు. రామూనాయక్‌కు ఏం జరిగినా ప్రొ. అంజయ్యతో పా టు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చ రించారు. సమాచారం తెలుసుకున్న ఇతర ప్రొఫెసర్లు అక్కడకు చేరుకొని విద్యార్థ్దులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నివాస్ వీరికి మద్దతు తెలిపారు. వేధింపులకు గురి చేసిన అంజయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే రామూనాయక్ జాడ తెలుసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

comments