Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

మామూళ్లు ఇస్తారా.. జైలుకెళ్తారా..?

wgl

మహబూబాబాద్ ఎడ్యుకేషన్: మామూళ్లు ఇవ్వలేదని సారా కేసుకు బదులు గంజాయి కేసు నమోదు చేసి, ఓ అధికారి మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ శివారు గిరిప్రసాద్‌తండాకు చెందిన మధు, సుమన్‌లపై అక్రమ కేసులు బనాయించారని నంగారభేరి ఆధ్వర్యంలో స్థానిక ఎక్సైజ్ కార్యాలయం ముందు బాధితులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ ఆందోళన నిర్వహించారు. గంటపాటు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డీటీఎఫ్ సీఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ నుంచి బయ్యారం వైపుగా వెళ్తున్న రెండు ఆటోలలో బెల్లం రవాణ అవుతున్నట్లు ప్రత్యేక సమాచారం ఆధారంగా తనిఖీలు నిర్వహించగా ఒక ఆటోని అదుపులోకి తీసుకుని సోదాలు చేయగా 10 బెల్లం బ్యాగ్‌లు, నాలుగు కేజీల గంజాయి, 20కేజీల పట్టిక, 10 లీటర్ల సారా లభ్యమైనట్లు పేర్కొన్నారు. బాధితులు మధు, సుమన్‌లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
లక్ష ఇవ్వనందుకే గంజాయి కేసు
తమపై ఉద్దేశపూర్వకంగానే అక్రమ కేసులు బనాయించారని, లక్ష ఇస్తారా జైలుకు వెళ్తారా అంటూ వారం నుంచి మమ్మలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. లక్ష రూపాయలు ఇస్తే కేసులు మాఫీచేస్తామని, లేకుంటే గంజాయి కేసులో జైలుకు వెళ్ళవలసి వస్తుందని పరోక్షంగా బెదిరింపులకు దిగినట్లు వారు ఆరోపించారు. దీంతో మాకు ఆత్మహత్యే శరణ్యమంటూ బాధితులు ఎక్సైజ్ కార్యాలయం ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
తప్పుడు కేసులు బనాయించిన అధికారులను సస్పెండ్ చేయాలి
గిరిజన యువకులు మధు, సుమన్‌లపై ఎక్సైజ్ డీటీఎఫ్ సీఐ బి.కృష్ణ తప్పుడు కేసు బనాయించారని లంబాడి హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్), నంగారభేరి జిల్లా అధ్యక్షులు గుగులోత్ భీమానాయక్ డిమాండ్ చేశారు. గిరిజన యువకులు మామూళ్లు ఇవ్వాలని, లేకుంటే బెల్లం కేసుకు బదులు గంజాయి కేసుల్లో జైలుకు పంపిస్తానని బెదిరించారని పేర్కొన్నారు. గిరిజన యువకుడు మధు సోదరిపై అసభ్యకరంగా ప్రవర్తించి తన వంటిపై చేయి చేసుకున్న అధికారులను తక్షణమే విధులనుంచి తొలగించాలని డిమాండ్‌చేశారు. ఒక బాధ్యత గల అధికారి హోదాలో ఉండి ఒక మహిళకు కనీసగౌరవం ఇవ్వకుండా అసభ్యకరంగా వ్యవహరించిన అధికారులపై మహిళా చట్టాలను అమలుచేస్తూ వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌చేశారు.

Comments

comments