హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్లో శనివారం తెల్లవారుజామున పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 37 మందిపై కేసులు నమోదు చేశారు. 25 కార్లు, 12 బైకులను పోలీసులు సీజ్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ ఇస్తామని పోలీసులు తెలిపారు.