హుజూర్నగర్ టౌన్ : చౌకధరల దుకుణాల సరుకుల పంపిణీని ప్రభు త్వం పూర్తి ప్రక్షాళన చేయనుంది. పేదవారి ఆకలికి అందాల్సిన బియ్యం ఇప్పటి వరకూ పెద్ద ఎత్తున పక్క దారులు పడుతుండటంతో దానిని అరికట్టేందుకు ఈ పాస్ విధానాన్ని రేషన్ షాపుల్లో అమలు చేయనుంది. వచ్చే నెల నుంచి సూర్యాపేట జిల్లాలోని అన్ని రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ ద్వారా వేలి ముద్రలు తీసుకొని సరుకులు పంపిణీ చేయనున్నారు. సబ్సీడీ ధరలపై అందిస్తున్న సరుకులు అర్హులైన పేదవారికే అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా హైద్రాబాద్ జిల్లాలో గత ఏడాది ఈ విధానాన్ని అమలు చేయగా సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా దీనిని అమలు చేయనున్నారు. ఇదే విధానంలో ఫిబ్రవరి నెల నుంచి సూర్యా పేట జిల్లాలోని 609 రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ మిషన్ల ద్వా రా సరుకులు పంపిణీని ప్రారంభించనున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రానికి రేషన్ షాపులకు అందజే యనున్న బయోమెట్రిక్ మరియు వెయింగ్ మిషన్లు వచ్చాయి. జనవరి 2, 3, 4 తేదీల్లో బయోమెట్రిక్ మిషన్ల వినియోగం, ఈ పాస్ విధానం అమలును డీలర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 307403 రేషను కార్డులు ఉండగా 905356 యూనిట్ల గాన ఒక యూనిట్‌కు 6 కిలోల చొప్పున 55, 529 క్వింటాళ్ల బియ్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు. వీటిలో 288558 ఆహారభద్రత కార్డులు, 18795 అంత్యో దయ కార్డులు, 50 అన్న పూర్ణ కార్డులు ఉన్నాయి. వీరందరికీ బయో మెట్రిక్ మిషన్ ద్వారా వేలి ముద్రలు తీసుకొని బి య్యాన్ని అందిం చనున్నారు. ఈ పాస్ విధానం అమలు జరిపేదుకు రేషన్ షాపులన్నింటికి బయో మెట్రిక్ మిషన్లు మరియు తూకాలు వేసేందుకు వే యింగ్ మిషన్లను ప్రభుత్వం ఉచితంగా అంద జేస్తోం ది. ఇప్పటికే రేషను కార్డులన్నీ ఆధార్‌తో అను సంధానం అయి ఉన్నాయి. సరుకుల పంపిణీ సమ యంలో కార్డు దారుడు వేలి ముద్రలు వేసి అవి సరి పోలితేనే బియ్యం, పంచదార, కిరోసిన్ తదితర సరుకులు అందించనున్నారు. కొలతల్లో ఎటువంటి తేడాలు లేకుండా ఉండేందుకు ఈ వేయింగ్ మిషన్ల ను కూడా రేషన్ షాపులకు పంపిణీ చేస్తున్నారు. రోజు వారీగా రేషన్ డీలర్ తన వేలి ముద్రలను వేసి సరుకుల నిల్వలను ఆన్లైన్ చేసిన తరువాతనే పంపి ణీని ప్రారంభించాలి. సాయంత్రం సరుకులు ఇచ్చిన తర్వాత మిగిలిన సరుకుల వివరాలు నమోదు చేయాలి. ఇలా రోజు వారీ స్టాక్ వివ రాలు ఆన్లైన్లో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు కార్డు దారులు ఇచ్చే సరుకులు ఎప్పటిక ప్పుడు ఆన్లైన్ నమోదు అవుతుండటంతో స్టాక్ వివరాలు పక్కాగా నమోదు అవుతున్నాయా లేదా అనేది ఉన్నత అధికారులకు వెంటనే తెలు స్తుం ది. దీంతో డీలర్ల వద్ద ఎలాంటి అక్రమాలు జరగకుండా నియంత్రించే అవకా శం ఏర్ప డుతుంది. అంతేగా కుండా కార్డు దారుడు తన సమీపంలోని రేషన్ షాపులో సరుకులు తీసుకొనే పోర్టబులిటీ సదు పాయాన్ని కూడా ఈ పాస్ విధానం ప్రారంభం అయిన తర్వాత అమల్లోకి వస్తుంది. దీని వల్ల సమీపంలోని రేషన్ షాపులో వేలి ముద్రలు వేసి సరుకులు పొందే అవకాశాన్ని వినియోగదారులకు అందించనున్నారు. ఇప్పటి వరకు చాలా మంది కార్డు దారులు 2, 3 కిలో మీటర్ల దూరంలో గల ప్రాం తాలకు వెళ్లి సరు కులు తెచ్చుకుంటున్నారు. ఇటువంటి వారికి ఈ విధానం ఎంతో ఉపశమనం కలిగి స్తుంది. ఈ పాస్ విధానాన్ని పక్కాగా అమలు చేయడానికి జిల్లా పౌర సరఫర శాఖాధి కారులు సన్నాహాలు చేస్తున్నారు.