Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

ప్రతి పథకం పేద ప్రజల కోసమే…

black

-అభివృద్ధే ఆ జెండగా సర్కార్ ముందడగు
– మూడో రోజు కొనసాగిన మన ఊరు-మన ఎంఎల్‌ఎ
– వ్యవసాయానికి సాగునీరు అందిచాలని రైతుల వినతి
– మంథని ఎంఎల్‌ఎ పుట్ట మదుకర్

మనతెలంగాణ/కమాన్‌పూర్: సిఎంకెసిఆర్ ప్రవేశపెడుతు న్న ప్రతి పథకం పేదల కొసమేనని, అభివృద్ధి ఫలాలు అందరికి అ ందాలన్న లక్షంతో కెసిఆర్ నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని ఎంఎల్‌ఎ పుట్ట మదుకర్ తెలిపారు. మన ఊరు-మన ఎంఎల్‌ఎ కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు మం డలంలోని కన్నాల,రాణాపూర్, జీడినగర్, జూలపల్లి, కమాన్‌పూర్, ముల్కలపల్లి గ్రామల్లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయో లేదో తెలుసుకోవడమే కాకుండా ప్రజా సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరించడానికి శ్రీకారం చు ట్టడం జరుగుతుందన్నారు.రైతుల సంక్షేమానికి టిఆర్‌ఎస్ ప్ర భుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని, రైతుల సంక్షేమానికి ,సిఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో రెండో పంటకు సమృద్ధిగా సా గునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు ఏమి చేయడం లేదని దు ష్ప్రృచారం చేస్తూ కాలం గడుపుతున్నారని, కాళేశ్వరం ప్రాజె క్టు ద్వారా సుందిళ్ల బ్యారెజీ ద్వారా నీటిని హైదారాబాద్‌కు తీ సుకెళ్తున్నారని ఆసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ గత 70ఏళ్లగా చేసిన అభివృద్ధి శూన్యమని, టిఆ ర్‌ఎస్ ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక మూడున్నర ఏళ్లో పే ద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమలు చేపట్టడం జరిగిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిచడంతో పాటు ప్రతి పంటకు ఎకరాకు 4000 రూపాయలను చెల్లించడం జరుగుతుందన్నా రు.మాకు పార్టీలతో సంబంధం లేకుండా టిఆర్‌ఎస్ ప్రభుత్వం , ఎంఎల్‌ఎ ఎల్లవేళ్లాల ప్రజలకు సేవా చేస్తున్నమనాన్నరు. మా దగ్గరికి ఏ పార్టీ నాయకుడు వచ్చినా పనులు చేసమే తప్ప ఏ నాడు ప్రతి పక్ష పార్టీ నాయకులు మీరు మేము మీకు పని చే యమని ఏనాడు అనాలేదని, నేను నా కుటుంబం అదికారం లో ఉన్న లేకున్న మంథనిలోనే ఉంటాము తప్ప హైదరాబాద్ లో ఉండే నైజం కాదన్నారు.తమ తల్లిగారి పేరిట 2010లో ట్ర స్ట్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమలు చేప్టడం జరుగుతుందన్నారు.ఆయా గ్రామాలలో ఎంఎల్‌ఎ పర్యటన సందర్భంగా లబ్దిదారులకు సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఇనుగంటి ప్రేమలత, జెడ్పీటీసీ మేకల సం పత్, సర్పంచ్ కోంతం సత్యనారాయణ, టిఆర్‌ఎస్ మండల అ ధ్యక్షుడు కిషన్‌రెడ్డి నాయకులు విజయ్ భాస్కర్, ఇనుగంటి రా మరావు, శ్రీనివాస్, ఇనుగంటి భాస్కర్‌రావు, మణికాకా, ఫీట్ల గోపాల్,నరేష్‌యాదవ్,ఆడెపు రమేష్,మేడగోని విజయ్ గౌ డ్,గుర్రం లక్ష్మీమల్లు, తాటికోండ శంకర్,బోల్లపల్లి శంకర్ గౌ డ్, పిట్టల తిరుపతి, గాదె సది,మేడగోని శేఖర్ గౌడ్, జంగపల్లి రవి,చెన్నూరి అభిలాష్ తదితరులు పాల్దొన్నారు.

Comments

comments