లిమా : పెరూలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.3గా నమోదైంది. పుక్వియో పట్టణానికి 124కిలోమీటర్లదూరంలో ఈ భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. భూకంపం వచ్చిన 300 కిలోమీటర్ల పరిధి వరకు మాత్రమే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం సంభవించిన ప్రాంతంలో సుమారు పది మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు.