Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

కార్తీ చిదంబరం ఆఫీసులపై ఈడీ దాడులు

KARTI

ఢిల్లీ : మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం కొడుకు కార్తీ చిదంబరానికి చెందిన ఆఫీసులపై శనివారం ఈడీ దాడులు చేసింది. కార్తీ చిదంబరం ఎయిర్‌సెల్ – మ్యాక్సిస్ మనీలాండరింగ్ కేసు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీ, చెన్నయ్ తదితర ప్రాంతాల్లో కార్తీ ఆఫీసులపై శనివారం ఈడీ అధికారులు దాడులు చేశారు. గత నెలలో కూడా చిదంబరం బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు చేసింది. ఈ కేసులో విచారణకు ఈనెల16న తమ ఎదుట హాజరు కావాలని కార్తీ చిదంబరానికి సమన్లు జారీ చేసింది. సమన్లు జారీ చేసిన రెండో రోజే కార్తీ చిదంబరం ఆఫీసులపై ఈడీ దాడులు చేయడం గమనించతగ్గ విషయం.

ED Attacks on Karthi Chidambaram offices

Comments

comments