Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

మరణంలోనూ వీడని పవిత్ర బంధం..!!

wife-and-husbend-image

అన్ననగర్ : భర్తను కాపాడుకొలేక పోతున్నాననే బాధతో భార్య సముద్రంలో మునిగి బలవన్మణానికి పాల్పడింది. దీంతో అదే రోజు రాత్రి భర్త పరిస్థితి విషమించి చనిపోయాడు. ఈ సంఘటన బుధవారం జరిగింది. చెన్నై మందవెలి సెయింట్‌ మేరీస్‌ రోడ్డులో నివాసముంటున్న ఉమామహేశ్వరి (46), ఈమె భర్త ప్రకాష్‌ వరదన్‌ (50) దంపతులకు కేశవన్‌ (19) అనే కొడుకుకున్నాడు. 8 నెలల క్రితం ప్రకాష్‌ వరదన్‌కి కేన్సర్‌ ఉన్నట్లు తెలింది. పలు ఆపరేషన్లు చేసినప్పటికీ కేన్సర్‌ భారీ నుంచి కోలుకోలేదు. కేన్సర్‌ నయం అయ్యే అవకాశం లేకపోవడంతో ప్రకాష్‌వరదన్‌ కొన్ని రోజులే బతుకుతాడని డాక్టర్లు వెల్లడించారు. దీంతో ఉమామహేశ్వరి భర్తను ఇంటికి తీసుకొచ్చి మంచి చెడ్డలు చూసుకునేది. బుధవారం తెల్లవారుజామున గుడికి వెళ్లి వస్తానని చెప్పిన ఉమామహేశ్వరి తిరిగి ఇంటికి రాలేదు. తన కుమారుడు కేశవన్‌ ఫోన్ కు ఆడియో మెసేజ్‌ పంపింది. అందులో తండ్రిని బాగా చూసుకోవాలని, తాను భర్త లేకుండా బతకలేనని వాపోయింది. దీనిపై కేశవన్‌ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టగా, ఈ క్రమంలోనే ఎలియట్స్‌ సముద్రతీరంలో ఉమామహేశ్వరి మృతదేహం కనిపించింది. అదే రోజు రాత్రి పరిస్థితి విషమించి ప్రకాష్‌వరదన్‌ చనిపోయాడు. ఒకే రోజున భార్యభర్తలు మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Comments

comments