Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

మగబిడ్డ పుట్టితే మూల్యం చెల్లించాల్సిందే

boy-baby-image

అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుంన్న సిబ్బంది పట్టించుకునే వారెక్కడ?

మన తెలంగాణ/నాచారం : కార్మిక విభాగ ఆసుపత్రిగా నాచారం డివిజన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఉద్యోగులు అక్రమంగా రోగుల వద్ద నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని మండిపడుతున్నారు. నాచారం డివిజన్‌లోని  ఈయస్‌ఐ  ఆసుపత్రిలో  ఈయస్‌ఐ కార్డు కలిగిఉన్న వారికి చికిత్సను  అందించడం అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క అభివృద్ధి పనుల్లో భాగంగా  ప్రైవే ట్ ఆసుపత్రిల్లో మాదిరిగా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చికిత్సను అందించాలని నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం ఆధునాతన పరికరాలను సైతం అందుబాటులో ఉండేలా కృషి చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందచేయనున్నట్టు ప్రచారం చేస్తూ ఉన్న కూడా ప్రభుత్వ ఆసుపత్రిల్లో సిబ్బంది మాత్రం తమ చేతివాటం రోగులపై చూపడం మర్చిపోలేకపోడం దురదృష్టకరంగా మారింది. నాచారం డివిజన్‌లోని హెచ్‌ఎమ్‌టి నగర్‌లో నివాసముండే మహేందర్, రాజ్యలక్ష్మి దంపతులు తన భార్య ప్రసవం కోసం మంగళవారం నాచారంలోని ఈయస్‌ఐ ఆసుపత్రిలో చేర్పించారు.

బుధవారం ప్రసవం అనంతరం తమరికి మగబిడ్డ పుట్టిందని చెప్పి సూమారు రూ. 2,500 ఇవ్వాలన్నారు. అదేమని ప్రశ్నిస్తే ఈ ఆసుపత్రిలో ఆడబిడ్డ పుట్టిన వాళ్లు రూ.1000, మగబిడ్డ పుడితే రూ.2000 వరకు ఇవ్వాలని చెప్పడంతో ఖంగుతిన్న బాలింత తరపు బంధువులు ఎవరికి చెప్పా లో తెలియక ఆసుపత్రి సిబ్బందికి ముడుపులు అందిం చి ఆమెని జాగ్రత్తగా చూసుకోవడానికి ఆసుపత్రి సిబ్బందిని వేడుకున్నట్టు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్‌ఐ కార్డు కలిగిఉండి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయుంచుకోలేని పరిస్థితి వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల  ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన రోగులకు ఆసుపత్రి వర్గాలు నరకం చూపెడుతూ లంచాల రూ పంలో డబ్బులు చెల్లించాలని ఇబ్బందులు పెట్టడంతో ఆసుపత్రిలోకి రావలంటే  కనీసం రూ.5000 నుండి రూ.8000ల వరకు డబ్బులు పెట్టుకొని ప్రసవానికి రావాలనే ఉద్దేశంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇప్పటికైనా నిరుపేదలకు వరంగా ఉన్న ప్రభు త్వ ఆసుపత్రి ఈఎస్‌ఐలో  మెరుగైన  వైద్యం అందించే దిశగా సిబ్బంది నడుచుకునే విధంగా అధికారులు, ఆసుపత్రి సూపరిండెంట్ చర్యలు తీసుకుంటారో లేదా అమ్మో ప్రభుత్వ ఆసుపత్రా అంటూ ప్రజలు భయానికి గురైయ్యే విధంగా ప్రవర్తిస్తారో వేచి చూడాల్సిందే.

Comments

comments