Search
Saturday 21 April 2018
  • :
  • :

టిఆర్‌ఎస్ హయాంలో అన్నదాతల భరోసా

pink

* ఇచ్చిన మాట నిలుపుకున్న దమ్మున్న ముఖ్యమంత్రి కెసిఆర్
* సంక్షేమ పథకాలకే ఏటా రూ.40వేల కోట్ల కేటాయింపులు
* చేతకాని ప్రతిపక్షాలను ప్రజలు తరిమికొట్టాలి
* అభివృద్ధ్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంలో మంత్రి లకా్ష్మరెడ్డి

మన తెలంగాణ/నవాబ్‌పేట్:ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్ ప్రభుత్వ హ యాంలో ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నదాతల పక్షపాతిగా వ్యవహరిస్తూ రైతుల సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ గత అస మర్థ ప్రభుత్వాల హయాంలో చితికి పోయిన అన్నదాతల బ్రతుకులకు భరోసా కల్పిస్తున్నారని తెలంగాణా రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖామంత్రి డా.సి.లకా్ష్మరెడ్డి పేర్కోన్నారు.గురువారం మండల పరిదిలోని వివిధ గ్రామాలలో అభివృధ్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.ముం దుగా మండల పరిదిలోని అమ్మాపూర్ గ్రామంలో 10లక్షల కేటాయిం పులతో మత్సశాఖ భవనం,ఎస్సీ కమ్యూనిటీ భవనం,పోమాల గ్రా మంలో ప్రతి గురువారం పెద్దమొత్తంలో నిర్వహించనున్న కూరగాయల అంగడిని ప్రారంభోత్సవం,తదనంతరం గ్రామంలో నిర్మితమౌతున్న బ్రి డ్జి పనులను పరిశీలించి గ్రామ కూడలిలో పార్టీ జెండాను ఆవిష్కరిం చారు.అక్కడినుండి నేరుగా కొల్లూరు గ్రామానికి బయల్దేరి గ్రామంలో కోటి డ్బ్బై లక్షల కేటాయింపులతో మిషన్ కాకతీయ పనులకు శంఖు స్థాపన,గ్రామ గేటు నుండి కేశవరావు పల్లి వరకు 2కోట్ల కేటాయింపుల తో బీటీ రోడ్డు పనుల శంఖుస్థాపన పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించా రు.అక్కడినుండి చౌడూరు గ్రామ పంచాయితీ పరిదిలో కోటి 65లక్షల కేటాయింపులతో నిర్మించబడ్డ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో పాల్గోని చౌడేరు గేటునుండి వీరన్నపల్లి గేటు వరకు ,కాకర్జాల నుండి తాండా మీదుగా బీటీ రోడ్డు పనులకు శంఖుస్థాపన చేశారు.ఈ సందర్భంగా వివిధ గ్రా మాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు నిరంతర విద్యుత్‌ను అందించి మాట నిలుపుకున్న దమ్మున్న మనిషి అని కొని యాడారు.రైతుల సంక్షేమం కోసం కోట్ల నిధులతో రిజర్వాయర్‌ల నిర్మాణం చేపడుతున్నారని రిజర్వాయర్‌లు పూర్తయితే రైతుల పొలాల్లో భూగర్భ జలాలు పెరిగి ప్రభుత్వం అందిస్తున్న నిరంతర విద్యుత్‌తో పం టలు ఏపుగా పండి,ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పంటకు రూ.4వేలతో వ్యవసాయ ఖర్చులు తగ్గి రైతుల బతుకులకు భరోసా లభిస్తుందన్నారు.
ప్రతిఏటా సంక్షేమ పథకాల అమలుకై 40వేల కోట్లు…
దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజలకై సంక్షేమ పథకాల అమలుకై ఏటా దాదాపు 40వేల కోట్లను ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా అని మంత్రి పేర్కోన్నారు.అలాగే అన్ని సామాజిక వర్గాలకు సమ న్యా యం అందిస్తూ వారి సంక్షేమం కోసం విభిన్న పథకాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు,సౌకర్యాలను కల్పిస్తూ పేద విధ్యార్థులకు ఉన్నత విద్యా ప్రమాణాలను అందిస్తూ,ప్ర భుత్వ ఆసుపత్రుల్లో కార్పోరేట్ స్థాయి ఉచిత వైద్యాన్ని అందిస్తుందన్నా రు.తెలంగాణా ప్రభుత్వ సంక్షేమ పథకాల ధాటికి కుదేలై ఉమ ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మతి తప్పి తిక్కతిక్కగా మాట్లా డుతున్నారని,రాష్ట్రప్రజల అథోగతికికారణమైన అసమర్థ కాంగ్రెస్ పార్టీ, నాయకులను తెలంగాణా ప్రజలు తరిమి కొట్టాలని పిలుపు నిచ్చారు.
గ్రామాల్లో మంత్రికి ఘన స్వాగతం…..
మండల పర్యటనకు విచ్చేసిన మంత్రి లకా్ష్మరెడ్డికి పోమాల గ్రామంలో సర్పంచ్ కొండనోళ్ల కృష్ణ,కొల్లూరులో గ్రామ పార్టీ అధ్యక్షుడు రఘు, చందర్‌నాయక్,రమేశ్‌గౌడ్,నాగనర్సిములు,బాలకిష్టయ్య,డీఎన్‌రావ్‌ల ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించగా చౌడూరులో సీనియర్ ఎస్టీ నాయకులు,వ్యాపారవేత్త లింబ్యానాయక్ ఆధ్వర్యంలో వందల మంది గిరిజనులు,యువకులు, పార్టీ ప్రజా ప్రతినిధులు,సార్టీ కార్యకర్తలు పార్టీ జెండాలతో మంత్రి లకా్ష్మరెడ్డికి ఎదురుగా బ్యాండు మేళాలతో ఎదురు గా వెళ్లి స్వాగతం పలకడం అందరిని విశేషంగా ఆకర్షించింది.
తెలంగాణా సర్కార్‌కు ప్రజలు అండగా వుండాలి….
ఎంపి జితేందర్‌రెడ్డి
ఉద్యమం ద్వారా తెలంగాణా సాధించుకొని అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం విభిన్న పథకాలతో బడుగు బలహీన వర్గాల అభ్యు న్నతే ధ్యేయంగా ముందుకెళ్తుందని పాలమురు ఎంపి జితేందర్‌రెడ్డి పేర్కోన్నారు.కొల్లూరులో జరిగిన కార్యక్రమంలో హాజరైన ఎంపి మాట్లా డుతూ ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్న తెలంగాణా ప్రభుత్వానికి,ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ప్రజలు అండగా నిలవాలని ఆయన కోరారు.ఇచ్చిన మాట ప్రకారం రైతులకు నిరంతర విద్యుత్‌ను అందించిన ఘనత ముఖ్యమంత్రిదేనని అన్నారు.
మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిక….
మండల పరిదిలోని అమ్మాపూర్,చౌడూర్ గ్రామాలలో మంత్రి లకా్ష్మరె డ్డి సహక్షంలో కాంగ్రెస్ పార్టీని వదిలి పెద్దమొత్తంలో మువకులు,నాయ కులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.వారిని మంత్రి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలో ఆహ్వానించారు.కార్యక్రమంలో మంత్రి,ఎంపితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్,ఎంపిపి శ్రీనయ్య,మా ర్కెట్‌చైర్మైన్ ముత్యాల రవీందర్‌రెడ్డి,జెడ్‌పిటీసి ఇందిరాదేవి,పార్టీ మండ లాధ్యక్షులు మాడెమోని నర్సిములు,పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాల్యా నాయక్,గిరినాయక్,మైసమ్మ చైర్మైన్ జగన్మోహన్‌రెడ్డి,కోఆఫ్షన్ సభ్యు లు ఖాజామైనొద్దీన్,మార్కెట్ వైస్‌చైర్మైన్ మైనొద్దీన్,వ్యవసాయ సమితి మండల కన్వీనర్ అన్నవరం ఉమాపతిరెడ్డి,పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రతాప్,ఉపాధ్యక్షులు సంజీవరెడ్డి,యువత అధ్యక్షుడు రాధాకృష్ణ,,ప్రధా న కార్యదర్శి సంజీవరెడ్డి,జాగృతి జిల్లా నాయకులు నవనీత్‌రావ్, నాయ కులు నాగిరెడ్డి,యాదిరెడ్డి, గండుచెన్నయ్య,కూచూరు సంజీవ రెడ్డి,గో పాల్‌గౌడ్,అబ్దుల్లా,సంతోష్‌రెడ్డి,కటికె రాజు,నాగేశ్,రమేశ్ యాదవ్, శ్రీనూయాదవ్,రుద్రారం కృష్ణాగౌడ్,నుమల శేఖర్‌రెడ్డి,శంకర్‌నా యక్, కారుకొండ గోపాల్,రాములు,బాలయ్య,మాధవులు యాదవ్,అంత య్య,ఎంపిటీసి శంకర్,కటికెనరేష్,దేవునిపల్లి రాజు,లింగం,రహమత్, ఆంజనేయులు, మండల సర్పంచులు వెంకటేశ్,నర్సిములు,చి న్నయ్య, నర్సిములు,కొల్లూరు యాదమ్మ,అరుణమ్మ అంతయ్య పాల్గొన్నారు.

Comments

comments