Search
Friday 20 April 2018
  • :
  • :

ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్

man

మన తెలంగాణ / సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమితులైనారు. ఉస్మానియా యూనివర్శిటీలో పిహెచ్‌డి చేసిన ఎర్రోళ్ల శ్రీనివాస్ గతంలో టీఆర్‌ఎస్వీ వి భాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. మలి దశ ఉద్యమంలో విద్యార్థి సంఘాలను ఏకం చేసి నడిపించడంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ ముం దున్నారు. మంత్రి హరీష్‌రావు అనుయాయునిగా ఉన్న ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఆంథోల్ టీఆర్‌ఎస్ టికెట్ ఆశించారు. తరువాత నామినేటెడ్ పదవి కోసం ప్రయత్నించారు. ఎంతో కాలం నుంచి పార్టీకి నమ్మకంగా పనిచేస్తూ వచ్చారు. దీంతో హైకమాండ్ అతని శ్రమను గుర్తించి తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థి నాయకునిగా ఉన్న ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నామినేటెడ్ పదవి రావడం పట్ల విద్యార్థిలోకం హర్షం వ్యక్తం చేస్తోంది.

Comments

comments