Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

ఎథికల్ హ్యాకింగ్

life

లేటెస్ట్ టెక్నాలజీ… లైఫ్‌స్టైల్ కాదు వార్ స్టైల్‌నూ మార్చేసింది. యుద్ధం చేయాలంటే బాంబులేసి రక్తపాతం సృష్టించాలన్నది ఒకప్పటి మాట. కాని ఇప్పుడు ఒక్క క్లిక్‌తో అగ్రరాజ్యాలను సైతం కూల్చేయొచ్చు. ఇందుకు అవసరమైన టూల్ హ్యాకింగ్…! ఈ పేరు వినిపిస్తే చాలు సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాలు సైతం గజగజ వణికిపోతు న్నాయి. ఈనేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ ప్రమాదాలను పసిగడుతూ వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం పుట్టు కొచ్చిన సాంకేతిక పరి
జ్ఞానమే ఎథికల్ హ్యాకింగ్…..

ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్న నేటి తరుణంలో ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి హ్యాకింగ్. ఫోన్‌కాల్స్, ఈ మెయిల్, ఎస్ ఎం ఎస్ వంటి నిత్యం వినియోగించే సాంకేతికతలోను అనేక మోసాలు చోటు చేసుకుంటున్నాయి. మనకు తెలియకుండానే మన కంప్యూటర్‌లోని సమాచారాన్ని అక్రమంగా తస్కరిస్తున్నారు. ఇలా చేయడాన్నే హ్యాకింగ్ అంటారు. ఇక ఎథికల్ హ్యాకింగ్ అంటే… యజమాని అనుమతితో కంప్యూటర్‌లోకి ప్రవేశంచి డేటాను నాశనం చేయడం. కంప్యూటర్ డేటా ఎంత సురక్షితంగా ఉంది? దానిలో ఎలాంటి లోపాలున్నాయి? వాటిని ఎలా సరి చేయాలి? అనే విషయాలను గుర్తుచేయడానికి ఎథికల్ హ్యాకర్లను నియమిస్తారు. అయితే వీళ్లు కంప్యూటర్‌లో ఉన్న కీలక సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి.
అర్హతలు
ఇంటర్ అర్హతతో ఎథికల్ హ్యాకింగ్ సర్టిఫికెట్, డిప్లొమా ఇన్ నెట్‌వర్క్ సెక్యురిటీ కోర్సుల్లో చేరవచ్చు.
నైపుణ్యాలు
* basic computer knowledge
* programming languages (java, c,c++, perl, python, ruby)
* web application (net, php, vital)
* opersting systems (windos, linux)
* network devices (switches routers, firewalls)
* basic knowledge in IP protocols (SMTP,ICMP, HTTP)
* Good communication skills
జాబ్‌రోల్స్
* ప్రైవేటు సెక్టార్
* ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్
* ఎథికల్ హ్యాకర్
* సెక్యూరిటీ అనలిస్ట్
* సెక్యూరిటీ కన్సల్టెంట్
* ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజర్.
గవర్నమెంట్ సెక్టార్
* నెట్‌వర్క్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్
* చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్
* అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టర్
* చీఫ్ అప్లికేషన్ సెక్యురిటీ ఆఫీసర్
ఉద్యోగ వేదికలు
* ప్రభుత్వ రంగం
* ప్రైవేట్ రంగం
* డిఫెన్స్ ఆర్గనైజేషన్స్
* లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆర్గనైజేషన్స్
* బీపిఓలు
* ఫోరెన్సిక్ ఆర్గనైజేషన్స్
* బ్యాంకులు
* డిటెక్టివ్ కంపెనీస్
* ఫైనాన్స్ సంస్థలు
* ఇన్వెస్టిగేషన్ ఎజన్సీస్
వేతనాలు
సరైన అర్హతలు, నైపుణ్యాలున్న ఎథికల్ హ్యాకర్స్‌కు ప్రారంభం వేతనం ఏడాదికి రూ. 3
లక్షలు ఇవ్వడానికి సంస్థలు సిద్ధంగా వున్నాయి. అనుభవం పని తీరును ఆధారంగా ఏడాదికి రూ.30 లక్షలు ఆర్జిస్తున్న వారు కూడా ఉన్నారు.
కొన్ని విద్యా సంస్థలు
* ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్
* www. isoeh. com
అరిజోనా ఇన్ఫోటెక్
* www. airzonainfotech.com
ఇన్స్‌ఫైర్ సైబర్ సెక్యూరిటీ
* http:// www. cybersecurityindia.in
ఫ్రిస్టిన్ ఇన్ఫో సొల్యూషన్స్
* http:// www.pristineinfo.com
* www. infysec. com ఇన్ఫీ సెక్.

Comments

comments