Search
Sunday 21 January 2018
  • :
  • :

ఘనంగా పదవీ విరమణ సన్మానోత్సవం

padaviమన తెలంగాణ/మక్తల్ : మక్తల్ సబ్ డివిజన్ డిప్యూటీ ఇఇ ఎంఎస్ . రామమూర్తి, వర్క్ ఇన్స్‌స్పెక్టర్ భగవాన్‌గౌడ్‌లకు మంగళవారం పదవీ విరమణ సమన్మానోత్సవం ఘనంగా నిర్వహించారు. మక్తల్ ఎంపిపి సు నితా గోపాల్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఎంపిపి మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవీవిరమణ తప్పదని, మక్తల్ మండలంలో 1998లో ఎఇ ఉద్యోగు బాధ్యతలలో మండలంలో చేప ట్టి న పనులను ప్రజలు మరువన్నారు. మంచినతమే ఆయుధంగా పని ఒత్తి డిలు ఉన్నా నిద్రాహారాలు మాని పనులు చేపట్టారన్నారు. 2017లో డి ప్యూటీ ఇఇగా బాధ్యతలు చేపట్టి పదవీ విరమణ పొండం సంతోషంగా ఉందన్నారు. వీరు శేషజీవతం ఆనందంగా గడపాలని ఆమె ఆకాంక్షిం చారు. బిజపి రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఇద్దరూ గురుశిశ్యులుగా మెలిగేవారని ఏమైన సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించు కునే వార న్నారు.  అందరితో కలసి ఉండి సౌమ్యుడిగా ఉండి మెలిగారన్నారు. మాజీ ఎంపిపి చంద్రకాంత్ గౌడ్ మాట్లాడుతూ పదవీ విరమణ నిజజీ వితంలో తప్పుకొప్పులు వ్యక్తమయ్యే రోజు అని అన్నారు. విజయానంద్ మాట్లాడుతూ ఉద్యోగ నిర్వహణలో పనులు నాణ్యతగా ఉంటేనే బిల్లులు ఇచ్చేవారన్నారు.  ప్రభుత్వానికి, కాంట్రాక్టర్లకు అనుసంధానంగా ఉం టూ ఉద్యోగ బాధ్యతలు చేపట్టారన్నారు. మార్కెట్ చైర్మన్  నర్సిం హ్మ గౌడ్ మాట్లాడుతూ పై ఇద్దరు బ్యాలెంన్స్‌గా ఉంటూ విదులు నిర్వహణ చేశారని వారు చేసిన సేవలు మరువలేమన్నారు. వారి సేవలు ఉపయో గించుకోవడానికి ఎంఎల్‌ఎతో మాట్లాడుతామన్నారు. అనంతరం వా రికి పలువురు అధికారులు, అనధికారులు తదితరులు వారిని శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పేట ఇఇపి ఆర్ నర్సిం గరావు, మరికల్ డిప్యూటీ ఇఇ నరేందర్, పేట డిప్యూటీ ఇఇ శ్రీహరి, బాబురావు, ఆంజనేయులు, మహిపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, తిమ్మ న్న, మధు సూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

Comments

comments