Search
Sunday 21 January 2018
  • :
  • :

దొంగ నోట్ల ముఠా అరెస్ట్

FAKE-NOTES

జనగామ : దొంగ నోట్లను సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యులు గల ముఠాను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 28న జనగామలో దొంగ నోట్ల మార్పిడి చేస్తున్నట్టు తమకు సమాచారం అందిందని జనగామ డిసిపి మల్లారెడ్డి తెలిపారు. ఈ క్రమంలో వలపన్ని ముగ్గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. అరెస్ట్ అయిన వారి నుంచి లక్ష రూపాయల విలువైన నకిలీ నోట్లతో పాటు రెండు కార్లు, ఒక స్కానర్, నోట్ల తయారీ కాగితాలను, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. నిందితులను విచారించిన అనంతరం రిమాండ్‌కు తరలించామని ఆయన పేర్కొన్నారు.

Fake Notes Gang Arrest

Comments

comments