Search
Saturday 21 April 2018
  • :
  • :

ప్రారంభమైన 24 గంటల విద్యుత్ ఆనందంలో రైతులు

lakeమనతెలంగాణ/అడ్డాకుల: వ్యవసాయరంగం అభివృద్ధ్ది చెందుతేనే అన్ని రంగాలు ముందుకు సాగుతాయని ఎప్పుడైతే గ్రామాలు సస్యశ్యామలంగా వుంటే ప్రజల జీవన విధానంలో మార్పు వస్తుందని తద్వార ఆర్థిక పరిపు ష్టికి గ్రామాలు చేరుకుంటాయని వ్యవసాయశాస్త్రవేత్తలు చెబుతున్న మాటల ను నిజం చెయ్యడానికి తెలంగాణ ప్రభుత్వం రైతులకు నిరంతర విద్యుత్ సరఫరాకు పూనుకోవడం చారిత్రాత్మకం అని విశ్లేషకులు బావిస్తున్నారు. గతంలో నీళ్లు వున్న విద్యుత్ వుండేది కాదు,వున్నా నాణ్యమైన విద్యుత్ సరఫరా అయ్యేది కాదు ఎంతో మంది రైతులు రాత్రిపూట కరెంటు కష్టాల కు బలైపోయినారు.మోటార్లు కాలిపోయి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి సరి యైన దిగుబడి లేక అప్పులపాలైన రైతుల కష్టాలు నిత్యంకనిపించేవి.ఇటు వంటి కష్టాలకు చెరమగీతం పాడాలని రైతులకు నిరంతర విద్యుత్‌ను జన వరి ఒకటి నుండి ప్రభుత్వం ప్రారంభించింది.అడ్డాకుల మండల పరిధిలో ని గ్రామాల రైతులు ఇక నుండి కోతలు లేని విద్యుత్ సరఫరా అవుతుందని ప్రస్తుతం భూగర్భజలాలు సంవృద్ధిగా వుండడం,చెరువుల్లో నీళ్లు వుండడం వలన బోర్లు పుష్కలంగా నీటిని అందిస్తాయని ఎక్కవ ఆయకట్టును శిస్తు చేసుకోవడానికి అవకాశం కలుగుతందని ఆనందం వ్యక్తం చేశారు.కందూ ర్ గ్రామంలో సోమవారం మండల రైతుసమన్వయ సమితి కన్వీనర్ శ్రీకాం త్ రైతులతో కలిసి 24 గంటల విద్యుత్ ప్రారంభమైన వెంబడే మోటార్లను స్టార్ట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతులు ఆటోమేటిక్ లను తీసేసి అవసరం వున్నప్పుడు ఆన్ చెయ్యాలని,మోటార్లను కండీషన్ లో వుంచుకోవాలని,తగినన్ని మోటార్లు ట్రాన్‌పార్మర్ కింద వుండడానికి చూసుకోవాలని అన్నారు. దాదాపు అన్ని గ్రామాల చెరువుల నుండి నీటిని విడుదల చెయ్యడంతో రైతులు వరినాట్లు వెయ్యడానికి సిద్దమయ్యారు. అడ్డాకుల మండల పెద్దచెరువు కింద దాదాపు 550 ఎకరాల ఆయకట్టు వుంది,ఆదివారం చెరువు నుండి నీటిని విడుదల చెయ్యడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు .దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత చెరువు నీరు ఆయకట్టుకు నీరు చేరుతుండడంతో వరి నాట్లకు సిద్దమయ్యారు.రానున్న రోజుల్లో బుద్దారం గండి ద్వార అడ్డాకుల చెరువుకు శాశ్వత పరిష్కారంగా నీరు అందుతుందని అందుకు శాసనసభ్యుడు ఇటీవల సాంకేతిక అంశాల ను పరిశీలించాలని అధికారులను ఆదేశించారని అనుకున్నుట్లుగా పనులు జరిగితే అడ్డాకుల చెరువు ఎప్పుడు నీటితో కళకలలాడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments