Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

బస్టాండ్‌లో పసికందు

KID

నాగర్‌కర్నూలు : బిజినపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్‌లో నాలుగు రోజుల వయస్సు ఉన్న ఆడపిల్లను దుండగులు వదిలేసి వెళ్లారు. ఆదివారం ఉదయం ఈ పసికందును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సమాచారంతో ఐసిడిఎస్ అధికారులు ఆ పసికందును నాగర్‌కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఆ పసికందు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అనంతరం ఆ పసికందును మహబూబ్‌నగర్‌లోని శిశుగృహానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Female Kid in Bustand at Bijinapalli

Comments

comments