Search
Friday 20 April 2018
  • :
  • :

‘అజ్ఞాతవాసి’పై మహేష్ కత్తి సంచలన రివ్యూ

Mahesh-Kathi

హైదరాబాద్: భారీ అంచనాల మధ్య విడుదలైన అజ్ఞాతవాసి మూవీకి మిశ్రమ స్పందన వస్తున్న నేపథ్యంలో ఇటీవల పవన్‌పై వరుస విమర్శలతో విరుచుకుపడిన ఫిల్మిం క్రిటిక్ మహేష్ కత్తి సంచలన రివ్యూ ఇచ్చారు. కత్తి రివ్యూ ప్రకారం… ‘సీరియస్ కథకి కామెడీ కథనంతో చికాకుపెట్టి సినిమాను అపహాస్యం చేసిన సినిమా అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కెరీర్‌లో అత్యంత దారుణమైన సినిమా. రిస్క్ చేసి చూస్తే… టైమెమో.. మీ ఇష్టం!(ఈ సినిమా పాట ట్యూన్‌లో…)’ అని సంచలన రివ్యూ ఇచ్చారు కత్తి. ఈ మేరకు కత్తి తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. కాగా, ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే, నెగటివ్ రివ్యూ ఇచ్చిన కత్తిపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు.

Film Critic Kathi Mahesh Sensational Review on Agnyaathavaasi.

Comments

comments