Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

షూటింగ్ ల సందడి

mn

ఒక సినిమాను తెరకెక్కించాలంటే సీన్‌కు సరిపడే లొకేషన్స్ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలో ఒక సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది అంటే లొకేషన్స్ పాత్ర కూడా చాలానే ఉంటుంది. అయితే ఇటీవల మన తెలుగు తారలు లొకేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు దర్శకులు సెట్స్‌తో సరిపెడుతుంటే మరికొందరు ఏకంగా నిజమైన ప్రదేశాలలో భారీ ఖర్చుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ పరమైన సన్నివేశాలను చిత్రీకరించాలంటే నిజమైన ప్రదేశాలలో అయితేనే బెటర్ అని మన దర్శకులు అందుకు తగ్గ లొకేషన్స్‌ను సెట్  చేసుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం చాలా వరకు  షూటింగ్‌లు హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి. కొన్ని నిజమైన ప్రదేశాలలో ఎలాంటి మార్పులు చేయకుండా దర్శకులు షూటింగ్ చేస్తున్నారు. మహేష్‌బాబు ‘భరత్ అనే నేను’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతోంది. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోంది. అయితే రియాలిటీ ఎక్కువగా కనిపించాలని దర్శకుడు కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాడట. ఇక నాగార్జున-రామ్‌గోపాల్ వర్మ సినిమా కూడా హైదరాబాద్‌లోనే నడుస్తోంది. గచ్చీబౌలిలోని కొన్ని ప్రదేశాల్లో దర్శకుడు వర్మ యాక్షన్ పరమైన సన్నివేశాలను తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నాడు. ఇక నాగార్జున తనయుడు నాగచైతన్య కూడా హైదరాబాద్‌లోనే ‘సవ్యసాచి’ షూటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. ఉప్పల్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. చందు మొండేటి ఈ  సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.  ఇవేకాకుండా మరికొన్ని చిత్రాల షూటింగ్‌లు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి.

Comments

comments