Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

ఫలించని మంతనాలు

jodi

*అధికార పార్టీల మధ్య ముఖాముఖి
*ఒకరు రాష్ట్ర అధికార టిఆర్‌ఎస్ అభ్యర్థి
*మరొకరు కేంద్ర అధికార బిజెపి అభ్యర్థి
*ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరు పార్టీల నేతలు

మనతెలంగాణ/వరంగల్‌బ్యూరో:
అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది ఉం డగానే అధికార పార్టీలు బలనిరూపణ కు సిద్ధమయ్యాయి. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 44వ డివిజన్‌కు ఉప ఎన్నిక జరుగుతోంది. గత ఏడాది జులై 13న అధికార టిఆర్‌ఎస్ కి చెందిన కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్యకు గురైన విషయం తెలిసిందే. మురళి హత్యతో ఏర్పడిన ఖాళీని భర్తి చేసేందుకు ఎన్నికను నిర్వహిస్తున్నారు. అధికార టిఆర్‌ఎస్ పార్టీ నుంచి మురళి భార్య అనిశెట్టి సరితను నిలబెట్టగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తరుపున కొలను సంతోష్‌రెడ్డిని బరిలో నిలిపారు. ఇద్దరి మధ్యను ముఖాముఖి పోటి జరుగనున్నది. ఇద్దరులో ఒకరు కేంద్రంలో అధికార పార్టీ అభ్యర్థికాగా మరోకరు రాష్ట్రంలోని అధికార పార్టీ అభ్యర్థి కావడం విశేషం.
ఫలించని ఏకగ్రీవ ప్రయత్నాలు
44వ డివిజన్‌ను ఏకగ్రీవం చేసుకోవాలని టిఆర్‌ఎస్ పార్టీ నేతలు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. టిఆర్‌ఎస్ పార్టీ నుంచి హత్యకు గురైన మురళి భార్యనే అభ్యర్థిగా నిలబెడుతున్నామని ముందస్తుగానే సంకేతాలను ఇచ్చారు. మానవతా దృక్పథంతో అన్ని పార్టీలు సహకరించాలని టిఆర్‌ఎస్ వరంగల్ పశ్చిమ ఎంఎల్‌ఎ దాస్యం వినయ్‌భాస్కర్, వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి అన్ని రాజకీయ పార్టీలను కలిశారు. ఏకగ్రీవానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి సానుకూలంగా స్పందన రావడంతోపాటు తమ పార్టీ నుంచి అభ్యర్థిని నిలపలేదు. టిడిపి, ఇతర వామపక్ష పార్టీలు కూడా అభ్యర్థులను నిలపలేదు. స్వతంత్రులుగా నామినేషన్ వేసిని ఇద్దరు అభ్యర్థులు కూడా ఉపసంహరించుకొని టిఆర్‌ఎస్ అభ్యర్థి సరితకు మద్ద తు తెలియజేస్తున్నారు. అన్ని పార్టీలు సహకరించాయి. కాని బిజెపి నుంచి మాత్రం ఏది ఏమైన బరి నుంచి తప్పుకునేది లేదని బరిలోనే ఉన్నారు.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరు పార్టీలు
44వ డివిజన్ ఎన్నికలను అధికార టిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు రెండూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు మరో ఏడాది వ్యవధి మాత్రమే ఉన్నది. బిజెపి వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ స్థానాలలో ఒంటరిగానే పోటిచేస్తామని ఇప్పటికే ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ప్రకటించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో తమ బలాన్ని నిరూపించుకునేందుకు ఇదో చక్కటి అవకాశంగా బిజెపి భావిస్తుంది. వచ్చే ఎన్నికల్లో బిజెపి వరంగల్ పశ్చిమ నుంచి తప్పనిసరిగా పోటిచేయనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలో తమ పార్టీ తరుపున కొలను సంతోష్‌రెడ్డిని బరిలో నిలిపారు. అయితే వరంగల్ పశ్చిమలో అధికార టిఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్‌ఎ దాస్యం వినయ్‌భాస్కర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 44వ డివిజన్ తమ సిట్టింగ్ స్థానం కాబట్టి ఎలాగైన గెలిపించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. టిఆర్‌ఎస్ పార్టీపూర్తిగా ఈ డివిజన్‌పై దృష్టి సారించింది. వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల నేతలను ప్రచారంలో భాగస్వాములను చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఇరు పార్టీలకు 44వ డివిజన్ ఎన్నిక ఫ్రీఫైనల్‌గా భావిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

comments