Search
Tuesday 19 June 2018
  • :
  • :

గుట్టపైన వేలిముద్రలు వేస్తున్న పింఛన్ దారులు

 bamma

*కొండెక్కితేనే.. ఆసరా అందుతోంది

*ఇంటర్‌నెట్ సేవలు అందక పింఛన్ దారుల అవస్థలు
*కొండెక్కలేక తిప్పలు పడుతున్న వృద్ధులు

మన తెలంగాణ/ నల్లగొండ ప్రతినిధి: అక్కడ కొండెక్కితేనే ఆపన్నులకు అందుతోంది ఆసరా…ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలోని కొండ పైకెక్కి వేలిముద్రలు వేయలేకా.. ప్రయాణికులు నిండితేనే కాని రాని ఆటోలను బతిమిలాడలేకా.. ఆసరా పింఛన్ల కోసం అవస్థలు పడుతున్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లిలో 220 మంది వికలాంగ, వితంతు, వృద్ధాప్య పింఛన్‌దారులు ఉన్నారు. వీరు గ్రామపంచాయతీ కార్యాలయంలో బయోమెట్రిక్ మిషన్‌పై వేలిముద్రలు వేసి పింఛన్ డబ్బులు తీసుకుంటు ఉంటారు. ఇందుకు ఇంటర్ నెట్‌ను ఎయిర్‌టెల్ కంపెనీ కనెక్షన్ తీసుకు న్నారు. గత 18 రోజులుగా ఆ ఊరికి నెట్ సంకేతాలు అందక పోవడంతో పింఛన్ దారులు వేలిముద్రలు వేయలేక పోవడంతో డబ్బులు తీసుకోలేకపోయారు. దీంతో ఊరి సమీపంలోని రామలింగేశ్వరస్వామి గుట్టపై ఎయిర్‌టెల్ సిగ్నల్ అందుతున్నాయని ఊరు వారు చెప్పడంతో గ్రామశాఖ పోస్టుమాన్ బయోమెట్రిక్ యంత్రంతో గుట్ట ఎక్కి ప్రయత్నించగా సఫలీకృతుడయ్యాడు. దీంతో పింఛన్‌దారులను గుడి కొండపైకి రమ్మని చెప్పాడు. ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో రామలింగేశ్వర స్వామి కొండగట్టుపైకి వెళ్లాలంటే వృద్ధులు, వికలాం గులఫించన్ దారులు ఆటోకు రూ. 20 చెల్లించి ప్రయాణించాల్సి వస్తోంది.  ఒక్కరు, ఇద్దరే ఉంటే ఆటో ఖర్చులకు సరిపోవని డ్రైవర్ మొండికేస్తుండటంతో ఆటో నిండేంత వరకు మిగత వా రు అక్కేడే ఎదురుచూడాల్సి వస్తుంది. ఇటివలే తెలంగాణ ప్రభు త్వం  కోటి రూపాయల నిధులతో  గాట్ రోడ్డు నిర్మాణం చేసిం ది. ఆ రోడ్డు గుండానే కొండపైకి ఆటోలు ప్రయాణిస్తున్నాయి. కాగా తుమ్మలపల్లి గ్రామంలో ఒక్క ఆటోకూడ లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి గుట్టకు భక్తులను తీసుకొచ్చే ఆటోలనే వెళ్లాల్సివస్తుంది. దింతో ఫించన్ దారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వి. నర్సయ్య  అనే పింఛన్ దారుడు మాట్లాడుతూ కొండ పైకి ఆటోలో ప్రయాణించి ఈ నెల  ఫించన్ డబ్బులు తీసుకునేందుకు అనేక అవస్థలు పడ్డట్టు చెప్పాడు. ప్రభుత్వం గ్రామపంచాయతీలోనే ఫించన్ అందించే ఏర్పాటు చేయాలని కోరారు. తుమ్మలపల్లి గ్రామపంచాయితీ పోస్టుమాస్టర్ యాదయ్య మాట్లాడుతూ నెట్‌వర్క్ సమస్యతో బయోమెట్రి క్ సిస్టమ్ పనిచేయకపోవడంతో ఇబ్బందులు ఎదురైనట్లు తెలిపారు. ఈ సమస్యను సంబందిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని వారు త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Comments

comments