Search
Friday 20 April 2018
  • :
  • :

మేడ్చల్ లో అగ్నిప్రమాదం

Fire-accident

మేడ్చల్: ఘట్ కేసర్  మండలం చెంగిచెర్ల సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. డీజిల్ ట్యాంకర్ కు మంటలు అంటుకొని తీవ్రరూపం దాల్చాయి. దీంతో పక్కనే గ్యాస్ సిలిండర్ లారీకి మంటలు అంటుకున్నాయి. మంటల నుంచి భారీ శబ్ధాలు వెలువడడంతో స్థానికులు పరుగులు తీశారు. అటుగా బైక్ పై వెళ్తున్న వాహనదారుడు మంటల్లో సజీవదహనమయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్యాంకర్ నుంచి డీజిల్ ను దొంగతనం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments