Search
Sunday 21 January 2018
  • :
  • :

ట్రంప్ టవర్‌లో అగ్నిప్రమాదం

Trump-Tower

న్యూయార్క్: అమెరికాలోని మన్‌హటన్‌లో గల అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు చెందిన ట్రంప్ టవర్‌లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. టవర్‌పై అంతస్తులో ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకొని మంటల్ని అదుపుచేసేందుకు యత్నిస్తున్నాయి. కాగా, ప్రమాదం జరిగినప్పుడు ట్రంప్ వాషింగ్టన్‌లో ఉన్నట్లు తెలిసింది. 58 అంతస్తులు గల ట్రంప్ టవర్‌లో షాపింగ్ మాల్స్, ఖరీదైన రెస్టారెంట్లు, అత్యాధునిక ఆఫీసులు, లగ్జరీ అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. 1983లో ట్రంప్ ఈ టవర్‌ను నిర్మించారు.

Fire at Trump Tower in New York City.

Comments

comments