Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

అగ్నిప్రమాదంలో ఐదుగురు సజీవదహనం

Fire-accident1

జైపూర్: రాజస్థాన్ లోని విధ్యానగర్ ప్రాంతంలోని సెక్టార-9లో శనివారం ఉదయం ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. సిలిండర్ పేలడంతో మంటలు రెండంతస్థుల భవనమంతా వ్యాపించాయి. మంటల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనమయ్యారు. స్థానికులు సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Comments

comments