Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

అదుపుతప్పిబొలెరో బోల్తా : ఐదుగురు మృతి

Accident

జోగులాంబ గద్వాల : గద్వాలలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ఘటనలో ఐదుగురు మృత్యువాత పడ్డారు ..15 మంది తీవ్ర గాయాలయ్యాయి.  వీరంతా చిన్నపాడు గ్రామానికి చెందిన కూలీలు గద్వాలలోని ఓ మిల్లులో పనిచేస్తున్నారు. డిఎస్పి సురేంద్రరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతులు చిన్నపాడు గ్రామానికి చెందిన కొత్త వెంకటన్న, కోట్ల వెంకటన్న, కమ్మరి లోహిత్, కమ్మరి గీతమ్మ, ఎమునంపల్లి గ్రామానికి చెందిన అరుణమ్మగా గుర్తించారు. కూలీలంతా ఆదివారం రాత్రి పని పూర్తి చేసుకుని తిరుగి వస్తున్న సందర్భంలో పారిచెర్ల వద్ద ఈ ప్రమాదం జరిగింది . గాయాలైన వారిని చికిత్స కోసం గద్వాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకున్నారు.

Comments

comments