Search
Thursday 18 January 2018
  • :
  • :
Latest News

విమానానికి తప్పిన పెను ప్రమాదం

Pegasus

అంకారా : టర్కీకి చెందిన పెగాసాస్ ఎయిర్‌లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. టర్కీ రాజధాని అంకారా నుంచి ట్రాబ్‌జాస్‌కు ఈ విమానం బయల్దేరింది. ట్రాబ్‌జాస్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వేపై కాకుండా నల్ల సముద్రానికి కొద్ది మీటర్ల దూరంలో విమానం దిగింది. అక్కడ ఉన్న బురదలో విమానం ఇరుక్కపోయింది. ఘటన జరిగిన సమయంలో విమానంలో 162 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు పైలట్లు, నలుగురు సిబ్బంది ఉన్నారు. అయితే వీరందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై పెగాసాస్ ఎయిర్‌లైన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు.

Flight Escaped from Accident in  Trabaz Airport

Comments

comments