Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

జాతరపై కెసిఆర్ చిన్నచూపు

GANDRA

మాజీ చీఫ్ విఫ్ గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి ప్రతినిధి: నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమ పోరాటంలో సీఎం కేసీఆర్ సమ్మక్క -సారలమ్మల స్ఫూర్తితో తెలంగాణ సాధించుకుంటామని చెప్పి నేడు ఆ తల్లులను విస్మరించాడని మాజీ చీప్ విఫ్ గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. సోమవా రం విలేకర్ల సమావేశంలో గండ్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద గిరిజన మహాజాతరైన శ్రీమేడారంపై సీఎం చిన్నచూపు చూస్తున్నాడని, రాష్ట్రంలోనే వేములవాడ, యాదాద్రి లక్ష్మీనర్శింహాస్వామి, కొమురవెళ్లి మల్లన్నతోపా టు దేవాలయాలతోపాటు మరికొన్ని పుణ్యక్షేత్రాల అభివృద్ధికి కోట్లాది రూపాయలను కేటాయించి కోట్లాది భక్తులు దర్శించుకునే గిరిజన జాతరకు అతి తక్కువ నిధులు కేటాయించి వివక్షత చూపడంతోపాటు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని విమర్శించారు. మేడారం జాతర ఈ నెల 31నుండి ప్రారంభం కాబోతున్నప్పటికీ జాతరై మంత్రులు, ఉన్నత స్థా యి అధికారులు సందర్శించి సమీక్షించాల్సి ఉన్నప్పటికీ హైదరాబాద్ స్థాయిలోనే సమీక్షలు జరిపి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలపన కొనసాగుతుందనీ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలపై త్వరలోనే పెద్ద ఎత్తున భూపాలపల్లి నియోజకవర్గంలో పాదయాత్రలు చేపట్టి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వ వైపల్యాలను ప్రజల ముంగిట్లోనే ఎండగడుతానని హెచ్చరించారు. 2019ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, భూపాలపల్లి గడ్డపై కాంగ్రేస్ జెండా ఎగరడం తప్పదని గండ్ర వెంకటరమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గణపురం మండలంలోని ధర్మరావుపేటలో ఇటీవల మృతి చెందిన కేసెట్టి గిరిబాబు, సురేష్, కొమురమల్లు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ జిల్లా, మండల నాయకులు పోలుసాని లక్ష్మీనర్శింహారావు, మారగాని దేవెందర్‌గౌడ్, ఎంపిటిసి దూదయ్య, గండ్ర యువసేన జిల్లా నాయకులు పోరెడ్డి పూర్ణచెంద్రారెడ్డి, దుర్గయ్య, రాజేందర్, కరుణాకర్‌రెడ్డి, సురేష్, భరత్‌రెడ్డి, రాజు, కృష్ణ, సత్యంతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments