Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

మేడారం జాతరకు నాలుగు వేల బస్సులు

JATARA

హైదరాబాద్ : ఈనెల 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర జరగనుంది. ఈ జాతర కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జాతర సందర్భంగా నాలుగు వేల బస్సులు నడపాలని టిఎస్ ఆర్‌టిసి నిర్ణయించింది. తెలంగాణలోని 50 కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులునడపాలని నిర్ణయించినట్టు ఆర్‌టిసి అధికారులు తెలిపారు. జాతర సందర్భంగా 10 లక్షల నుంచి 12 లక్షల మంది ఆర్‌టిసి సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేడారంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ జాతరకు ప్రజలు భారీ ఎత్తున తరలిరానున్నారు.

Four Thousand buses for Madaram Jatara

Comments

comments