Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

టెలికంతో భవిష్యత్తు ఆశాజనకం

telicom

గత శతాబ్దికాలంగా శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉపాధి కల్పనలో ముందుంటోంది టెలికం రంగం. టెలికం గురించి తెలియని వారుండరు. ఎందుకంటే మొబైల్ ఫోన్స్, స్మార్ట్‌ఫోన్స్ మొదలుకొని  రక్షణరంగంలో కీలకమైన క్షిపణుల తయారీ , అంతరిక్ష రంగంలో శాటిలైట్స్ ప్రయోగాల వరకూ అంతా టెలికం రంగం ప్రగతి చెందటం వల్లనే.  లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలను కల్పిస్తున్న టెలికం రంగం గురించి తెలుసుకుందాం…

ప్రతిఏటా సుస్థిర అభివృద్ధి బాటలో నడుస్తున్న టెలికం రంగంలో భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. టెలికం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ అంచనా ప్రకారం 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానున్న కారణంగా 2020 –21 నాటికి టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో దాదాపు తొమ్మిది లక్షల కొత్త కొలువులు ఏర్పడనున్నాయి.
ఈ రంగంలో కొలువుల పరంగా రెండు మిలియన్ల ఉద్యోగాలున్నాయి. ఉత్పత్తి విభాగాల్లో 1.76 మిలియన్ ఉద్యోగాలు. సర్వీస్ ప్రొవైడర్స్ విభాగంలో 3.7లక్షల ఉద్యోగాలు. రానున్న ఐదేళ్లలో నాలుగు మిలియన్ల ఉద్యోగాలు. మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాల నేపథ్యంలో పరోక్షంగా భవిష్యత్తులో 50లక్షల మందికి అవకాశాలు కల్పించనున్నారు. కొత్త ఉద్యోగావకాశాలకు దోహదం చేస్తున్న ఎఫ్‌డిఐలు, స్వదేశీ సంస్థలతో ఒప్పందాలు, వ్యాపార విస్తరణ జరుగనున్నాయి. టెలికం రంగంలో కెరీర్ సొంతం చేసుకోవాలంటే ఈ కింది అర్హతలు ఉండాలి.
* బీటెక్ స్థాయిలో ఈసీఈ , సీఎస్‌ఈ, ఈటీఎం బ్రాంచ్‌లు
* టెలికం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పలు షార్ట్‌టర్మ్ సర్టిఫికెట్ కోర్సులు
* టెలికం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ వైర్‌లెస్ టెక్నాలజీల ఆధ్వర్యంలో కోర్సులు-
* బీఎస్‌ఎన్‌ఎల్ ఆధ్వర్యంలో జీఎస్‌ఎం ఆర్‌ఎఫ్ ఇంజనీర్ సర్టిఫికెట్ కోర్సు.
షార్ట్‌టెర్మ్ కోర్సులు:
టెలికం రంగంలో షార్ట్‌టెర్మ్ కోర్సులతోనూ కొలువులు సొంతం చేసుకోవచ్చు. మొబైల్ అప్లికేషన్ డెవలపర్స్, సర్వీస్ టెక్నీషియన్స్, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్, రిపెయిర్ ఎగ్జిక్యూటివ్స్ వంటి విభాగాల్లో ఇతర అకడమిక్ నేపథ్యం ఉన్న వారుకూడా ఉద్యోగాలు సంపాదించవచ్చు. సంబంధిత విభాగాల్లో ప్రస్తుతం పలు షార్ట్ టర్మ్ సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఆయా విభాగాలపై నైపుణ్యాలను అందిస్తున్నాయి. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్స్‌కు సంబంధించి ఆర్ట్, మేనేజ్‌మెంట్, హ్యుమనిటీస్ వంటి కోర్సులు పూర్తిచేసిన వారికి అవకాశాలు లభిస్తున్నాయి.
ఈసీఈ సీఎస్‌ఈ: బీటెక్ సీఎస్‌ఈ, ఈసీఈ పూర్తిచేసిన అభ్యర్థులకు టెలికం రంగంలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి. నెట్‌వర్క్ ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, అప్లికేషన్ డెవలప్‌మెంట్ తదితర విభాగాల్లో విస్తరించాల్సిన విధులు , అందుకు అవసరమైన నైపుణ్యాలు ఈసీఈ, సీఎస్‌ఈ నేపథ్యం ఉన్న వారికి అకడమిక్‌గానే లభిస్తాయి. దీంతో వీరు సులభంగా ఉద్యోగంలో రాణించడానికి వీలు కుదురుతుంది.

Comments

comments