Search
Saturday 21 April 2018
  • :
  • :

నాలుగేళ్ల కనిష్ఠానికి జిడిపి వృద్ధి రేటు

 201718లో వృద్ధి రేటు అంచనా 6.5 శాతం 

 జిఎస్‌టి, వ్యవసాయ ఉత్పత్తి తగ్గడమే కారణం: సిఎస్‌ఒ వెల్లడి

GDPన్యూఢిల్లీ : దేశీయ ఆర్థిక వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (201718) జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 6.5 శాతమే నమోదనుందని ప్రభుత్వం అంచనా వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ముందస్తు జిడిపి వృద్ధి అంచనాలను శుక్రవారం సిఎస్‌ఒ(కేంద్ర గణాంకాల శాఖ) విడుదల చేసింది. 201718కు జిడిపి అంచనా 6.5 శాతంగా ఉంద ని ప్రధాన గణాంకాల నిపుణుడు టిసిఎ అనంత్ మీడియా సమావేశంలో తెలిపారు. జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) అమలు, వ్యవసాయ ఉత్పత్తు తగ్గుముఖం పట్టడమే జిడిపి మందగించడానికి కారణమని అన్నారు. 201617 ఆర్థిక సంవత్సరంలో జిడిపి 7.1 శాతంగా ఉండగా, అంతకుముందు 201415 సంవత్సరంలో ఇది 7.5 శాతంగా ఉండడం గమనార్హం. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిం ది. తయారీ రంగంలో జివిఎ(గ్రాస్ వాల్యూ యాడె డ్) కూడా 7.9 శాతం నుంచి 6.1 శాతానికి క్షీణించింది. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి కూడా తగ్గిం ది. వ్యవసాయ, అటవీ, మత్స రంగాల్లో వృద్ధి 4.9 శాతం నుంచి 2.1 శాతానికి పడిపోయింది. జిఎస్‌టి అమలు ప్రభావం పలు రంగాలపై చూపిందని, ఇది జిడిపి తగ్గడానికి కారణమవుతోందని అనంతర్ వివరించారు. ఏడాది  ఏడాది ఆధారంగా చూస్తే జివిఎ 6.1 శాతానికి పడిపోయింది. అలాగే వ్యవసాయ రంగం వృద్ధి రేటు అంచనా 2.1 శాతానికి తగ్గింది.  కేంద్రం గతేడాది ప్రవేశపెట్టిన జిఎస్‌టి, 2016లో పెద్దనోట్ల రద్దు చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది. దీంతోపాటు వ్యవసాయ, తయారీ రంగంలో మందగమనం కారణంగా వృద్ధి రేటు అంచనాలను సిఎస్‌ఒ తగ్గించింది.

Comments

comments