Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

gold
మనతెలంగాణ/శంషాబాద్ ః అక్రమంగా విదేశాల నుండి బంగారంను తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొవడంతో పాటు బంగారంను సీజ్ చేసిన సంఘటన శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఓమన్ దేశం నుండి ఓమన్ ఎయిర్‌లైన్ డబ్లూ వై 239లో శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అయితే ముందస్తు సమాచారం అందుకున్న కస్టమ్స్ అధికారులు అతను ఎయిర్‌పోర్టుకు చెరుకొగానే అదుపులోకి తీసుకొని విచారించగా అతని దుస్తులోను, కాలి అడుగు భాగంలో మూడు బంగారు కడ్డిలకు నలుపు రంగు పూసి ష్యూలో పెట్టుకొని వచ్చినట్లు తెలిపారు. దీంతో బంగారు కడ్డిలను స్వాధినం చేసుకొని తదుపరి విచారణ కోసం హైదరాబాద్ నగరానికి తరలించినట్లు తెలిపారు. స్వాధినం చేసుకున్న బంగారం విలువ దాదాపు రూ.10,64,227ఉంటుందన్నారు.

Comments

comments