Search
Saturday 21 April 2018
  • :
  • :

ప్రియుడి ఇంటిముందు ప్రియురాలి దీక్ష

Lover

ఆళ్ళపల్లి : ఏడు సంవత్సరాలు ప్రేమించి, పెండ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేసిన ప్రియుడి ఇంటిముందు న్యాయం చేయాలని ధీక్షబూనిన ప్రియురాలు. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని మైలారం గ్రామానికి చెందిన ఎరం రాజబాబు, అదే గ్రామానికి చెందిన గొగ్గెల సమ్మక్క గత ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెండ్లి చేసుకుంటామని ఇంట్లో వాళ్లకు తెలియచేయడంతో వారు వీరి ప్రేమను, పెండ్లిని నిరాకరించడంతో, ఇంట్లో వాళ్లకు తెలియ కుండా పెండ్లి చేసుకుందామని బయటకు వెళ్లడంతో, పెద్దమనసుతో ఆలోచించిన ఇరు కుటుంబాలు పెండ్లి చేద్దా మని నిశ్చయించుకున్నారు. అదే క్రమంలో పెండ్లి కార్డులు కూడా కొట్టించారు. ఇంతలో రాజబాబు, అతని కుటుంబ సభ్యులు మేముపెండ్లి చేసుకోము అని, నేను చేసిన తప్పులకు నష్ట పరిహారంగా డబ్బులు ఇస్తాననడం, నాపై కేసులు పెట్టుకోండి అనడంతో, సమ్మక్క ఆమెకుటుంబ సభ్యులు తీవ్ర మన స్థాపానికి గురయ్యారు. గ్రామపెద్దల దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయమని వారు కోరారు.

గ్రామపెద్దలు ఎంత చెప్పి నా రాజబాబు కుటుంబికులు పెండ్లిచేసుకోమని అనడంతో.. సమ్మక్క కుటుంబ సభ్యులకు అండగా మండలంలో ఉన్నఅఖిల పక్షం నాయకులు పూర్తి మద్దతుగా వారు వెన్నంటే ఉన్నారు. ప్రేమించిన రాజబాబు ఇంటిముందు ప్రియురాలు సమ్మక్క, ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, మండల అఖిల పక్ష నాయకులు మహిళ సంఘాలు బైటా యించి ధీక్షను చేబూని న్యాయం చేయమని డిమాండ్ చేశారు. గొగ్గెల సమ్మక్కమాట్లాడుతూ.. ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామని, పెండ్లిచేసుకుంటా నని చెప్పి నన్ను మోసం చేసాడని, నేను అతనినే పెండ్లి చేసు కుంటానని, నాకు తగు న్యాయంచేయాలని ఆమె కన్నీరు పెట్టుకుంది.

జెఎసి మండల అధ్యక్షులు రేసు ఎల్లయ్య మాట్లాడుతూ.. ప్రేమ, పెండ్లి అనే మాయ మాటలు చెప్పి మోసం చేసిన రాజబాబు లాంటి కామాంధులను వదిలిపెట్టకూడదని, అమ్మాయికి తగు న్యాయం జరిగేలా చూడాలని లేదంటే ధక్షలను మరింత ఉదృతం చేస్తామని డిమాండ్ చేశారు. భారత జాతీయ మహిళా సమాఖ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు ఈసం రమాదేవి మాట్లాడుతూ.. ఇలా నమ్మించి మోసం చేసిన రాజబాబు అమ్మాయిని పెండ్లి చేసుకునేంత వరకు ఇంటిముందే ధర్నా, ధీక్షలు కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు ఎండి.ఖయ్యూం, ఎన్.రాం బాబు, ఎండి.అతహర్, జి.సుబ్బారావు, ఎమ్.నాగేశ్వరరావు, బి. సత్యం, కె.హనుమంతు, పి.పాపారావు, కె.సుధాకర్, జి. లక్ష్మయ్య, కొత్తగూడెం పట్టణ మహిళా అధ్యక్షురాలు ఎమ్. లక్ష్మితదితరులు పాల్గొన్నారు.

Comments

comments