Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

పండుగకు ఊరెళ్తున్నారా జాగ్రత్త!

Police2

మన తెలంగాణ/బోయిన్‌పల్లి : సంక్రాతి పండుగ సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సి జాగ్రత్తలపై బోయిన్‌పల్లి ఇంచార్జి సిఐ జానకి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా తమ బంధువులు కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామాలకు వెళ్లే ప్రజలు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే దొంగతనాలను నివారించవచ్చన్నారు. స్వగ్రామాలకు వెళ్తున్న ప్రజలు తాము నివాసముంటున్న కాలనీపేరు, ఇంటినెంబర్, ఫోన్‌నెంబర్‌తో కూడిన వివరాలను పోలీస్ స్టేషన్‌లో అందజేయాలన్నారు. సంక్షేమ సంఘం సభ్యులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా అయా ప్రాంతాల్లో నిఘా పెంచటంతో పాటు గస్తీని ముమ్మరం చేస్తామన్నారు.

పండగ సందర్భంగా పోలీస్‌స్టేషన్ పరిధిలో 21 మంది సిబ్బందితో అదనపు బలగం అందుబాటులోకి వచ్చిందన్నారు. అదనపు బలగాలతో ప్రధాన కూడళ్లల్లో చెక్‌పాయింట్లు  ఏర్పా టు చేయనున్నామని ఈ నెల 16 వరకు దొంగతనాలను నివారించేందుకు ప్రధాన రహదారులు, కూడళ్లు లో గస్తీ ముమ్మరం చేసి అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా ఏరియా బిసీలు, పెట్రోలింగ్ వాహనాలతో సిబ్బందితో నిఘా పెంచానున్నామన్నారు. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్‌మెంట్ వాసులకు ఈ విషయంపై అవగాహన కల్పించనున్నామన్నా రు. పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రజలు బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ దిగువ పేర్కొన్న నంబర్‌కు 040-27853593 సమాచారం అందించాలన్నారు.

Police

Comments

comments